జాతీయ వార్తలు

ఒక్క ఛాన్స్ ఇస్తే ట్యాంపరింగ్ నిరూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: తనకు అవకాశం ఇస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఇవిఎంలు) ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపిస్తానని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని సవాల్ చేశారు. ఇవిఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో, దాని సాఫ్ట్‌వేర్ బండారం బయటపెడతానని సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. ‘నాకు 72 గంటల సమయం ఇవ్వండి. ఇవిఎంల సమాచారం మొత్తం తొలగిస్తా. సాఫ్ట్‌వేర్ ఎలా మార్చవచ్చో రుజువు చేస్తా’ అని ఆయన ప్రకటించారు. నిజాలు చెబుతుంటే తమను ఎన్నికల సంఘం అవహేళన చేస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. కాన్పూర్‌లో వినియోగించిన ఇవిఎంలను ఇటీవల మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలకు తరలించారని ఆయన ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో ఇవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించిన ఆప్ చీఫ్ తాజాగా ఎన్నికల సంఘం తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు పూర్తయ్యాక 45 రోజుల వరకూ ఇవిఎంలు వాడకూడదని, అయితే యూపీలోని కాన్పూర్‌లో వినియోగించిన వాటిని మధ్యప్రదేశ్‌కు ఎలా తరలించాలని కేజ్రీవాల్ నిలదీశారు. అది నిబంధనల ఉల్లంఘనేని ఆయన విమర్శించారు. ఏ బటన్ నొక్కినా బిజెపికే ఓటు పడేలా చేశారని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఢిల్లీ సిఎం ధ్వజమెత్తారు. ట్యాంపరింగ్‌తోనే యూపీలో గెలిచారని, దానివెనక బిజెపి ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవిఎంలు వద్దని కేజ్రీవాల్ ఇటీవల డిమాండ్ చేశారు.

చిత్రం..ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న కేజ్రీవాల్