జాతీయ వార్తలు

చట్టాన్ని సవరించాల్సిన అవసరమే లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఎన్నికల్లో ఓటు వేయడానికి ఇవిఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదు కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇవిఎంలే అత్యంత సురక్షితమైన, విశ్వసనీయమైనవిగా భావిస్తోంది. అయిదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో కాంగ్రెస్, బిఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలాంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఓటు వేయడానికి గతంలో మాదిరిగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించాలని గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే. తిరిగి పాత పద్ధతికి వెళ్లాల్సి వస్తే చట్టాన్ని సవరించాల్సి ఉంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే బ్యాలెట్ పేపర్ విధానానికి తిరిగి మారాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందా? అని ఎన్నికల కమిషన్‌కు చెందిన ఉన్నతాధికారిని పిటిఐ అడిగినప్పుడు అవసరం లేదని ఆయన చెప్పారు. ఓటు వేయడానికి ఇవిఎంలు, బ్యాలెట్ పత్రాలు రెండింటిని ఉపయోగించడానికి చట్టంలో వీలు ఉందని ఆ అధికారి చెప్పారు. చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని, అయితే ఎవిఎంలను ఉపయోగించాలా లేక బ్యాలెట్ పత్రాలనా అనేది ఎన్నికల కమిషన్ ఇష్టమని కూడా ఆయన అన్నారు. కాగా, ఇవిఎంలపై ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించడానికి ఇవిఎంలను హ్యాక్ చేసి చూపించమని కోరుతూ రాజకీయ పార్టీలను, ఇతరులను ఆహ్వానించాలని ఇసి భావిస్తోంది.