జాతీయ వార్తలు

భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దుందుడుకు వ్యవహారాలకు పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత, పాకిస్తాన్ వివాదాల మధ్య తలదూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా ఏం చేయగలుగుతుందనేది ఆలోచిస్తున్నామని ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి నిక్కి హీలే సోమవారం రాత్రి విలేఖరులతో చెప్పారు. భారత, పాకిస్తాన్ దేశాల మధ్య ఏదైనా జరిగేంత వరకు వేచి ఉండే బదులు ఏమీ జరగకముందే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దటం మంచిదని అమెరికా భావిస్తోందని భారత సంతతికి చెందిన నిక్కి హీలే వెల్లడించారు. ఈ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నదని నిక్కి హలే వ్యాఖ్యలు సూచిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఇంతకాలం భారత, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే విధానాన్ని అవలంబించింది. అందుకే అమెరికా రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకు వచ్చేదికాదు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సమయంలో పాకిస్తాన్‌ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేయటంద్వారా అమెరికాలోని భారత సంతతి ఓటర్ల మద్దతు కూడగట్టుకున్న ట్రంప్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమకుగల స్థానం ఏమిటనేది పరిశీలిస్తున్నామని అమెరికా చెబుతోంది. అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ముందు, ముందు రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదని పరిశీలకులు చెబుతున్నారు. భారత, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు అవసరమైతే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదని నిక్కి హీలే చెప్పటం గమనార్హం.

చిత్రం..నిక్కి హీలే