జాతీయ వార్తలు

అభిమానులతో సమావేశాన్ని వాయిదా వేసుకున్న రజనీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 8: అభిమానులతో సమావేశం కావాలన్న ఆలోచనను తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (66) వాయిదా వేసుకున్నారు. తనతో కలసి వ్యక్తిగతంగా ఫొటోలు తీయించుకోవాలనుకుంటున్న అభిమానుల కోర్కెను తీర్చేందుకు చెన్నైలో ఈ నెల 12-16 తేదీల్లో వారితో భేటీ కావాలని నిశ్చయించుకున్న రజనీకాంత్, ఇటువంటి అభిమానుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతానికి వారితో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే అభిమానులతో త్వరలో విడతల వారీగా సమావేశమవుతానని, ఒక్కో విడతలో రెండు జిల్లాల అభిమానులను సమావేశానికి ఆహ్వానించి వారితో కలిసి ఫొటోలు దిగుతానని, ఈ సమావేశాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని రజనీకాంత్ శనివారం ఒక ఆడియో సందేశంలో స్పష్టం చేశారు.