జాతీయ వార్తలు

మందిరం కోసం ప్రాణాలైనా ఇస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 8: అయోధ్యలో రామాలయ వ్యవహారం తన నమ్మకాలతో ముడిపడిన అంశమని, దీని కోసం జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమేనని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. రామ మందిర నిర్మాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న ఉమా భారతి శనివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమైన అనంతరం లక్నోలో విలేఖరులతో మాట్లాడుతూ, ‘రామాలయ వ్యవహారం నా నమ్మకాలు, విశ్వాసాలతో ముడిపడిన అంశమని చెప్పేందుకు ఎంతో గర్వపడుతున్నా. దీని కోసం నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా, నన్ను నేను ఉరి తీసుకోవాల్సి వచ్చినా అందుకు సిద్ధమే’ అని చెప్పారు. ఆదిత్యనాథ్‌తో జరిపిన చర్చల్లో రామాలయ నిర్మాణ అంశం ప్రస్తావనకు వచ్చిందా? అని విలేఖరులు ప్రశ్నించగా, దీనిపై చర్చించాల్సిన అవసరం తమకులేదని, ఇది తమకు కొత్త అంశమేమీ కాదని, ఆదిత్యనాథ్ గురువు మహంత్ అవైద్‌నాథ్ రామాలయ ఉద్యమానికి నాయకులని ఉమా భారతి తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నందున దీని గురించి తాను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని ఆమె చెప్పారు.