జాతీయ వార్తలు

వాళ్లు పిచ్చివాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 8: ఎయిరిండియా నిషేధానికి గురైన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌పై అన్ని విమాన యాన సంస్థలు ప్రయాణానికి అనుమతిస్తూ విమాన యాన సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే గైక్వాడ్ తన దురుసుతనాన్ని మానలేదు. శుక్రవారం లోక్‌సభలో తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగిన అనంతరం పౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజుపై శివసేన ఎంపిలు వీరంగం చేసిన అనంతరం మంత్రికి క్షమాపణలు చెప్పిన గైక్వాడ్ తాను మంత్రికి లేఖ రాశానే కానీ, ఎయిరిండియా ఉద్యోగులకు క్షమాపణ చెప్పే ప్రశే్నలేదని స్పష్టం చేశారు. పైగా ఎయిరిండియా ఉద్యోగులు పిచ్చివాళ్లంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఎయిరిండియా బాటలో రెండు వారాలుగా గైక్వాడ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచిన ఇతర ప్రైవేట్ సంస్థలు నిషేధాన్ని ఎత్తివేశాయి. తమ ఉద్యోగులు ప్రయాణికుల భద్రత కోసం కఠినంగా వ్యవహరిస్తున్నారని వారికి తగిన గౌరవాన్ని ఇవ్వటం తప్పనిసరి అని ఎయిరిండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ తరువాత ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మార్చి 23న గైక్వాడ్ దుర్వ్యవహారంపై విచారణ కొనసాగుతుందని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని విమానయాన శాఖమంత్రి జయంత్‌సిన్హా వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు.