జాతీయ వార్తలు

బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లే భారతీయులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దక్షిణాది వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత తరుణ్ విజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లే ఈ దేశంలో భారతీయులని ఆయన అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘మేము నల్లవాళ్లతో కలిసి జీవిస్తున్నామని తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల ఉద్దేశమేమిటి? మేము అంటే ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి వాళ్లే భారతీయులని ఆయన అర్థమా?’ అని చిదంబరం ప్రశ్నించారు. ఢిల్లీలో ఆఫ్రికా విద్యార్థులపై దాడుల విషయంలో ఇటీవల ఓ టీవీ చానల్‌లో జరజగిన చర్చాగోష్ఠిలో తరుణ్ విజయ్ మాట్లాడుతూ, ‘మేము వివక్షను పాటించే వాళ్లమే అయితే నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా జీవిస్తాం’ అని అన్నారు. అంతేకాదు మా చుట్టూ నల్లవాళ్లున్నారని, వాళ్లతో మేము కలిసి ఉండడం లేదా? అని కూడా ఆయన అన్నారు. కాగా, తన వ్యాఖ్యలపై అన్ని వర్గాలనుంచి విమర్శలు రావడంతో తరుణ్ విజయ్ ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పారు కూడా. అయినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై దక్షిణాదికి చెందిన మరో కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ఆపార్టీ నేత అయిన మల్లికార్జున ఖర్గే మండిపడుతూ, ఆయన వ్యాఖ్యలు దేశ ప్రజల మధ్య వివక్షను పాటించే కాషాయ పార్టీ(బిజెపి) ధోరణికి అద్దం పడుతోందని అన్నారు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని డిఎంకె ఎంపి టిఎస్‌కె ఇలంగోవన్ వ్యాఖ్యానించారు.