జాతీయ వార్తలు

మళ్లీ మమతకే అధికారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మార్చ్ 24: ఆరు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాల పాటు తృణమూల్ కాంగ్రెస్‌కు అధికారం కట్టిబెట్టినా మెజారిటీని తగ్గించి మమతా బెనర్జీ పట్ల తమకున్న అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చునని సర్వేలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ నాలుగు నుండి మే ఆరో తేదీ వరకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతోంది. టి.ఎం.సి, వామపక్షాలు-కాంగ్రెస్, బి.జె.పిల మధ్య జరిగే ముక్కోణపు పోటీలో మమతా బెనర్జీ విజయానికి ఎక్కువ అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మమతా బెనర్జీని ఓడించేందుకు వామపక్షాలు, కాంగ్రెస్‌లు సీట్ల సర్దుబాటు లోపాయికారిగా జరిగినా ఎన్నికల ప్రచారం మాత్రం రెండు పార్టీల నాయకులు కలిసి చేసుకోవటం గమనార్హం. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోటి.ఎం.సికి 184, వామపక్షాలకు 42, కాంగ్రెస్‌కు 42, ఇతరులకు 26 సీట్లు లభించాయి. ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్ సీట్ల సంఖ్య 150కి పడిపోవచ్చునని సర్వేలు సూచిస్తున్నాయి. వామపక్షలు, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కుదరటం మూలంగా టి.ఎం.సికి బాగా నష్టం కలుగుతోంది. వామపక్షాలు కాంగ్రెస్‌తొ పొత్తుపెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీ చేస్తే తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 200 సీట్లు గెలుచుకునేది. ఇప్పుడు వామపక్షలు, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకోవటంతోపాటు కలిసి ఎన్నికల ప్రచారం చేయటం వలన టి.ఎం.సి ఇబ్బందుల్లో పడిపోయింది. మమతా బెనర్జీ నీతి,నిజాయితీ పేరుతో ప్రజల మద్దతు సంపాదించటం తెలిసిందే. అయితే ఇటీవల తృణమూల్ ఎంపీలు బ్రోకర్ల నుండి డబ్బు తీసుకుంటూ పట్టుబడిని వీడియలోలు వెలుగులోకి రావటంతో మమతా బెనర్జీ ప్రతిష్ట దెబ్బతిన్నది. దీనికితోడు శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కూడా మమతా బెనర్జీ ప్రతిష్టను బాగా దిగజారటంతో దీని ప్రభావం సీట్లపై పడుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మమతా బెనర్జీ పట్టు ఏ మాత్రం సడలలేదు. అయితే దక్షిణ బెంగాల్‌లో టిఎంసికి ప్రభుత్వ వ్యతిరేక భావం ఎదురవుతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో టిఎంసి కొన్ని సీట్లు ఓడిపోవటం ఖాయమని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ముస్లింలు మెజారిటీలో ఉన్న మధ్య బెంగాల్, హిందువులు మెజారిటీలో ఉన్న ఉత్తర బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో టిఎంసి మెజారిటీ సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయవచ్చు.
వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల సీట్లు సర్దుబాటు చేసుకోవటంతోపాటు కలిసి ఎన్నికల ప్రచారం చేయటం వలన రెండు పార్టీల విజయావకాశాలు బాగా మెరుగయ్యాయి. వామపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే పది,పదిహేను కంటే ఎక్కువ సీట్లు గెలిచేవి కావు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలపటంతో టిఎంసి వ్యతిరేక ఓట్లు ఈ రెండు పార్టీల అభ్యర్థులకు పడే అవకాశాలున్నాయి. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి ఈసారి ఎనభై నుండి వంద సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే బిజెపి పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 17 శాతం ఓట్లు సంపాదించుకున్న బిజెపి పరిస్థితి ఇప్పుడు మరింత బలహీన పడింది. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయటంతో బిజెపి పరిస్థితి ఇబ్బంది కరంగా తయారైంది. రాష్ట్రంలోని మెజారిటీ ముస్లింలు తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటు వేయవచ్చునని సర్వేలు చెబుతున్నాయి. బిజెపి ప్రచార తీవ్రత పెరిగే కొద్దీ ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీకి మరింత చేరువ అవుతారని సర్వేలు సూచిస్తున్నాయి.