జాతీయ వార్తలు

తయారీదార్లు సైతం ట్యాంపర్ చేయలేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఇవిఎం) వాటిని తయారు చేసిన వారు కూడా ట్యాంపరింగ్ చేయలేరని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇవిఎంల విశ్వసనీయతపై రాజకీయ పక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇసి ఈ వివరణ ఇచ్చింది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇవిఎంలను ట్యాంపరింగ్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసి ఆదివారం అనుమానాలను నివృత్తి చేస్తూ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇసి వెబ్‌సైట్లకు వచ్చిన ప్రశ్నల్లో సైతం అధిక శాతం ఇవిఎంల పనితీరుకు సంబంధించే వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. ఇవిఎంలను గట్టిగా సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవలే రెండు ప్రకటనలు ఇచ్చింది. ఇప్పుడు జనం అడిగిన ప్రశ్నలకు సమాధానాల రూపంలో ఇసి మరో ప్రకటన ఇచ్చింది. వీటిలో ప్రధానమైన ప్రశ్న అయిన ఇవిఎంలను హ్యాక్ చేయవచ్చా అన్న ప్రశ్నకు ఎట్టి పరిస్థితుల్లోను అది సాధ్యం కాదని ఇసి సమాధానం ఇచ్చింది. చివరికి ఇవిఎంలను తయారు చేసే వారు సైతం తయారు చేసే సమయంలో తమకు అనుగుణంగా వాటిని ట్యాంపర్ చేయలేరని తెలిపింది. 2006 వరకు కూడా ఎం 1 మోడల్ ఇవిఎంలను తయారు చేశారని, హ్యాకింగ్ చేయడానికి వీలు లేని సెక్యూరిటీ ఫీచర్లు వాటిలో ఉన్నాయని ఇసి తెలిపింది. 2006నుంచి 2012 వరకు ఎం 2 మోడల్ ఇవిఎంలను తయారు చేశారని, వాటిలో మరిన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లను చేర్చారని ఇసి తెలిపింది. ఉద్దేశపూర్వకంగా పదే పదే ఒకే బటన్‌ను నొక్కినా అది గుర్తిస్తుందని తెలిపింది. ఇసిఐ -ఇవిఎంలను కంప్యూటర్‌తో సైతం అనుసంధానం చేయడానికి సాధ్యం కాదని ఇసి స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌తో కానీ ఇతర నెట్‌వర్క్‌తో కానీ అనుసంధానం చేయడానికి వీలు కాదని ఇసి ఆప్రకటనలో తెలిపింది. 2006నుంచి వివిధ రాష్ట్రాల్లో ఇవిఎంలను తయా రు చేస్తున్నారని, వాటిని వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నామని ఇసి తెలిపింది. ఏ అభ్యర్థి, ఏ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తారనే విషయం ఉత్పత్తిదారులయిన ఇసిఐఎల్, బిఇఎల్‌కు సైతం ముందుగా తెలియదని కూడా తెలిపింది. నిజానికి ఇవిఎంలలోకి బయటినుంచి ఏ కొత్త వస్తువును చొప్పించడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేసింది. 2013నుంచి తయారు చేస్తున్న కొత్త ఎం 3 ఇవిఎంలలో టాంపరింగ్‌లాంటి వాటిని సైతం గుర్తించగలిగిన సరికొత్త ఫీచర్లు ఉన్నాయని ఇసి స్పష్టం చేసింది. అంతేకాదు కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా మన దేశం విదేశాల్లో తయారు చేసే ఇవిఎంలు వేటినీ కొనుగోలు చేయడం లేదని ఇసి స్పష్టం చేసింది. కాగా, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇవిఎంలను ఎందుకు ఉపయోగించడం లేదు? అన్న మరో ప్రశ్నకు ఇసి సమాధానమిస్తూ, ఆ దేశాల్లోని మిషన్లు ఎదుర్కొంటున్న సమస్య ఏమింటంటే అవన్నీ కూడా కంప్యూటర్‌తో కంట్రోల్ చేయగలిగినవని, నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయబడినవని , ఫలితంగా అవి హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉండేవిగా తయారవుతున్నాయని ఇసి తెలిపింది. అంతేకాకుండా ఆ దేశాల చట్టాల్లో అవసరమైనన్ని సెక్యూరిటీ ఫీచర్లు, రక్షణలు కూడా లేవని, ఫలితంగా ఇవిఎంల వాడకాన్ని ఆయా రాష్ట్రాల హైకోర్టులు కొట్టివేశాయని ఇసి తెలిపింది.