జాతీయ వార్తలు

బీసీ బిల్లుకు లోక్‌సభ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రాజ్యాంగ ప్రతిపత్తితో కూడిన జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో 360మంది సభ్యులు మద్దతు తెలుపగా, ఇద్దరు మాత్రం ప్రతికూలంగా ఓటు వేశారు. దీనిపై రాజ్యసభ మంగళవారం చర్చ జరిపి ఆమోదం తెలిపిన అనంతరం బిల్లు చట్టరూపం దాలుస్తుంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ వ్యవహరిస్తున్న చందంగానే ఎన్బీసీ కమిషన్ సైతం వ్యవహరిస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ప్రకటించారు. కమిషన్‌లో మహిళా సభ్యురాలు ఒకరుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 3రాష్ట్రాల బీసీ జాబితాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. కేంద్ర జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలని రాష్ట్రం సిఫారసు చేసే పక్షంలో కమిషన్ నియమ నిబంధనల మేరకు పార్లమెంట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం2 అని వెల్లడించారు. బీసీ వ్యవహారాల్లో రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరించబోదన్నారు. బీసీ కమిషన్ బిల్లుకు పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మొదట ఆయా రాష్ట్రాల అంగీకారం తీసుకోవాలని ప్రతిపక్షం స్పష్టం చేసింది. ముస్లింలకు మతం ఆధారంగా కాకుండా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అంశాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. కాపు, జాట్, పటేల్ తదితర వర్గాలనూ బీసీ జాబితాలో చేర్చాలని బిజెపి ఎంపీ బర్తుృహరి మహతామ్ డిమాండ్ చేశారు. ఎన్బీసీ కమిషన్‌లో తప్పకుండా మహిళా సభ్యురాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెరాస ఎంపీ బి వినోద్‌కుమార్, మరికొందరు డిమాండ్ చేశారు. కమిషన్‌లో ఐదుగురు సభ్యులనే నియమించారని, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాదిరిగా తొమ్మిదిమందిని నియమించాలని ఆర్పీఐ ఎంపీ ప్రేమచంద్రన్ డిమాండ్ చేశారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినందుకు తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎన్డీయే ప్రభుత్వాన్ని అభినందిస్తూ, బీసీ రిజర్వేషన్లకు భూతంగామారిన క్రిమిలేయర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీల బడ్జెట్ పెంచి, ఫూలే ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని, బీసీల సామాజిక, ఆర్థిక సర్వే జరిపించి వివరాలు వెల్లడించాలని కోరారు. వైకాపా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ కొత్త కమిషన్‌తో బీసీ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కులాలను చేర్చే అంశంపై ఫిర్యాదులను పరిశీలించే అధికారం కమిషన్‌కే ఉండాలని, కమిషన్ సిఫార్సులను కేంద్రం కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించే అంశంపై దృష్టి సారించాలన్నారు. బీసీ రిజర్వేషన్లను వెనుకబడిన, బాగా వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, పూర్తిగా వెనుకబడిన క్యాటగిరీలుగా వర్గీకరించాలని రేణుక ప్రతిపాదించారు.