జాతీయ వార్తలు

హిమాచల్ సిఎంకు మళ్లీ ఈడి సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో విచారణకు హాజరకావలని ఈడి నోటీసులు ఇచ్చినా సింగ్ బేఖాతరు చేశారు. దీంతో గురువారం మళ్లీ ఈడి నోటీసులు ఇచ్చింది. ఈనెల 20 దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలుత జారీ చేసిన సమన్లకు సంబంధించి సింగ్ నుంచి గురువారం వరకూ ఎలాంటి సమాచారం లేనందున తాజాగా నోటీసులు జారీ చేసినట్టు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో వాంగ్మూలం నమోదు నిమిత్తం దర్యాప్తు అధికారి ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావల్సిందిగా హిమాచల్‌ప్రదేశ్ సిఎంకు ఇంతకు ముందు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిఎం వీరభద్రసింగ్, ఆయన భార్య, కుటుంబ సభ్యులపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 2009-11 మధ్యకాలంలో వీరభద్రసింగ్ కేంద్ర ఉక్కు మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు సిబిఐ అభియోగం. సింగ్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడమేకాకుండా ఆస్తులను అటాచ్ చేశారు.