జాతీయ వార్తలు

పద్మవిభూషణులు ఏసుదాస్, జగ్గీ వాసుదేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 13: రాష్టప్రతి భవన్‌లో రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మొత్తం 44 మంది ప్రముఖులు పద్మ అవార్డులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గురువారం నాడు అందుకున్నారు. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, ప్రముఖ గాయకుడు కెజె ఏసుదాస్ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన ‘పద్మవిభూషణ్’ అవార్డులను అందుకున్నారు. పద్మభూషణ్ అవార్డులను అందుకున్నవారిలో ‘మోహన్ వీణ’ సృష్టికర్త పండిట్ విశ్వమోహన్ భట్, ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, జైన్ గురువు జైనాచార్య రత్నసుందర్‌సూరి మహరాజ్ ఉన్నారు. ఈ రోజు అవార్డులు అందుకోవలసిన 44 మందిలో 40 మంది స్వయంగా రాష్టప్రతినుంచి పురస్కారాలను అందుకోగా, మరణానంతరం అవార్డులు ప్రకటించిన ముగ్గురి తరఫున వారి బంధువులు స్వీకరించారు. మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత హాజరు కాలేదు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రఖ్యాతి శిల్పి ఎక్కా యాదగిరిరావు,ప్రముఖ వైద్యుడు డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వాహీద్,లక్ష్మి ఆసుయంత్రం సృష్టికర్త చింతకింద మల్లేశం,త్రిపురనేని హనుమాన్ చౌదరి రాష్టప్రతి చేతుల మీదుగా అందుకొన్నారు. అనంతరం ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరిరావు మాట్లాడుతూ తాను అందుకున్న ఈ పద్మశ్రీ పురస్కారాన్ని తెలంగాణ అమర వీరులకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో శిల్ప కళా అకాడమీ ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే చింతకింద మల్లేశం మాట్లాడుతూ చేనేత కార్మికుడైన తనను అవార్డుకు ఎంపిక చేయడం అనందంగా ఉందన్నారు. తాను తయారు చేసిన ఆసు యంత్రాలు ఇంకా కిందిస్థాయి వరకు చేరలేదన్నారు. పద్మశ్రీ అవార్డులు అందుకున్నా వారిలో ప్రముఖ క్రీడాకారిణిలు సాక్షి మాలిక్,దీపా కర్మాకర్, వికాస్ గౌడ్, తంగవేలు మరియప్పన్ తదితరులు ఉన్నారు.
ఈ పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్పీకర్ సుమిత్రా మహాజన్, బిజెపి సీనియర్ నేత అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. గత నెల 30న జరిగిన కార్యక్రమంలో 39 మంది ప్రముఖులు పద్మ అవార్డులను రాష్టప్రతి చేతులు మీదుగా అందుకొన్నారు.

చిత్రాలు..రాష్టప్రతి భవన్‌లో గురువారంనాడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్, జగ్గీ వాసుదేవ్