జాతీయ వార్తలు

60వేల మందిపై ఐటి శాఖ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలోని నల్లధనాన్ని వెలికితీయడంలో నిమగ్నమైన ఆదాయపు పన్ను (ఐటి) శాఖ శుక్రవారం ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ప్రారంభించింది. ఈ రెండో దశలో దర్యాప్తు చేయడానికి 60వేలకు పైగా మందిని గుర్తించింది. వీరంతా పెద్ద నోట్లను రద్దు చేసి, పాత నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించిన కాల పరిమితి సమయంలో అక్రమాలకు పాల్పడినట్లుగా భావిస్తోంది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సమయంలో అమ్మకాలపై వచ్చిన నగదుగా పేర్కొన్న వ్యాపారులు వీరిలో ఉన్నారు. అంటే పెట్రోలు పంపులు, ఆసుపత్రులు వంటి అత్యవసరాలకు సంబంధించినవి వీటిలో ఉన్నాయి. అంతకన్నా ముందుతో పోలిస్తే వీరు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ఇచ్చిన కాలంలో ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసినట్టు ఐటి శాఖ గుర్తించింది. అలాగే పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు కూడా ఈ ‘హై రిస్క్’ కలిగి ఉన్న 60వేల మందిలో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోళ్లు జరిపిన వారు, బోగస్ కంపనీలను ఉపయోగించుకొని నిధుల అక్రమ రవాణాకు పాల్పడినవారితో పాటు మొదటి దశ ఆపరేషన్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల ప్రశ్నలకు స్పందించని వారిపై కూడా ఈ రెండో దశ ఆపరేషన్‌లో దర్యాప్తు చేయనున్నారు. ఈ 60వేలకు పైగా గల మందికి తొలుత ఆన్‌లైన్‌లో సమాచారం ఇచ్చి, వివరాలు రాబట్టడం జరుగుతుందని, తదుపరి ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తారని ఆ శాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. తమ ఆపరేషన్‌లో భాగంగా పన్ను చెల్లించే వ్యక్తులను సంబంధిత పత్రాలు సమర్పించవలసిందిగా కోరుతారని ఆయన వివరించారు.