జాతీయ వార్తలు

గిరిజన యోధులకు మ్యూజియంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఏప్రిల్ 16: స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు పోషించిన గణనీయమైన పాత్రను జనానికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా 50చోట్ల వాస్తవిక మ్యూజియంలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం ఇక్కడ 1817లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒడిశాలో సాయుధ తిరుగుబాటు (పైకా తిరుగుబాటు) జరిపిన 16 మంది గిరిజన స్వాతంత్య్ర యోధుల కుటుంబ సభ్యులను ప్రధాని సత్కరించారు. ఈ పోరాటంలో చాలామంది గిరిజన యోధులు అమరులయ్యారు. స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు పోషించిన పాత్ర గణనీయమైందని ప్రధాని అంటూ, వారి సేవలను గుర్తు చేసుకోవడానికి దేశంలోని 50 ప్రాంతాల్లో వాస్తవిక మ్యూజియంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు స్వాతంత్య్ర పోరాట చరిత్ర కొన్ని కుటుంబాలు, సంవత్సరాలు, సంఘటనలకే పరిమితమైందని, అయితే స్వాతంత్య్ర పోరాటం అనేక సంవత్సరాలు సాగిన భారీ ఉద్యమమని, నేటి తరాలు దీనిగురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన ఇక్కడ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. సాయుధ తిరుగుబాటు ఉద్యమం అమరులైన వారి కుటుంబ సభ్యులను ఆయన శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అమరులైన వారి త్యాగాలను గుర్తుచేసే అవకాశం లభించినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని, వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడం తన అదృష్టమని ఆయన అన్నారు. 1817లో ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పైకాలకు ఖుర్దా రాజు వద్ద సైన్యాధిపతిగా పని చేసిన బక్షీ జగబంధు బిద్యాధర్ నాయకత్వం వహించారు.

చిత్రం..భువనేశ్వర్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ