జాతీయ వార్తలు

విఐపిల భద్రతను తగ్గించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: విఐపిలకు కల్పిస్తున్న భద్రతను తగ్గించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్రం అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు వంటి ఎమర్జెన్సీ వాహనాలు మినహా మిగతా వాహనాలన్నింటిపై ఎర్ర బుగ్గల (బెకన్ లైట్ల) వినియోగాన్ని బుధవారం నిషేధించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశ ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యక్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విఐపి సంస్కృతికి ముగింపు పలకాలనే కేంద్రం నిర్ణయం గురించి ప్రస్తావించగా, ‘ప్రతి ఒక్కరూ విఐపియే. అదే మా ప్రభుత్వ తత్వం’ అని ఆయన బదులిచ్చారు. ఇది చిన్న చర్యయే అయినప్పటికీ, ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలనే సందేశాన్ని పంపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బెకన్ లైట్ల వినియోగాన్ని నిషేధిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. లేకుంటే అవి ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తాయని పేర్కొన్నారు. రామజన్మభూమి- బాబరీ మసీదు వివాదంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ కేసు గత కొనే్నళ్లుగా కొనసాగుతోందని, ఇందులో కొత్తేమీ లేదని అన్నారు. అయితే బాబరీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రభావం బిజెపిపై ఎలా ఉంటుందనేది ఆయన వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న అంశాల్లో కొన్ని ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అలాంటి వాటిని నిషేధించజాలమని వెంకయ్య నాయుడు అన్నారు. ‘ఇది చాలా విస్తృతమైన అంశం. దీని గురించి మనం ఆలోచించాలి. చర్చించాలి. ఎందుకంటే మనం సామాజిక మాధ్యమాన్ని నిషేధించే ఆలోచన చేయజాలం. సమాజం దీని గురించి చర్చించి, చివరకు ఒక నిర్ణయానికి రావాలి’ అని ఆయన అన్నారు.