జాతీయ వార్తలు

10మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/లక్నో, ఏప్రిల్ 20: దేశంలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడికి కుట్ర జరుగుతోందనే అనుమానంతో అయిదు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 10 మంది ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేయగా, మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు., ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఉత్తరప్రదేశ్, మహారాష్టల్రకు చెందిన యాంటీ టెర్రరిస్టు బృందాలు (ఎటిఎస్) ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బిహార్ రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గురువారం ఉదయం మహారాష్టల్రోని ముంబ్రా, జలంధర్ (పంజాబ్) నర్కతియా గంజ్ (బిహార్), ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్, ముజఫర్‌నగర్‌లలో దాడులు నిర్వహించినట్లు అధికారి ఒకరు చెప్పారు. ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ఎటిఎస్ ఐజి అసీమ్ అరుణ్ నోయిడాలో ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టయిన నలుగురు నిందితులు ఐసిస్ ఖోరసాన్ వర్గానికి చెందిన వారని, దేశంలో భారీ ఎత్తున దాడులు జరపడానికి పథక రచన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న
ముఫ్తీ ఫైజాన్, తన్వీర్‌లను బిజ్నోర్ జిల్లాలో అరెస్టు చేయగా, అదే జిల్లాకు చెందిన నజీమ్ శంషాద్ అహ్మద్‌ను ముంబయికి ఆనుకుని ఉన్న థానె జిల్లాలోని ముంబ్రా టౌన్‌షిప్‌లో, ముజమ్మిల్‌ను జలంధర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అరుణ్ చెప్పారు. అరెస్టు చేసిన నిందితులను నోయిడాలోని కోర్టులో హాజరు పరుస్తామని, వారిని లక్నో తీసుకెళ్లడం కోసం ట్రాన్సిట్ రిమాండ్‌కు అప్పగించాలని యుపి ఎటిఎస్ కోర్టును కోరుతుందని ఆయన చెప్పారు. అరెస్టు చేసిన వారి వద్దనుంచి ఐసిస్‌కు చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్‌లో కేంద్ర ఇంటెలిజన్స్ ఏజన్సీలు ముఖ్య పాత్ర పోషించినట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన వారంతా కూడా 18-25 ఏళ్ల మధ్య వారేనని, ముంబయి, జలంధర్, యుపి లాంటి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారని, వీరంతా కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఉగ్రవాద సమాచారానికి ప్రభావితులయినట్లు కూడా తమ దర్యాప్తులో తేలిందని యుపి పోలీసు శాంతిభద్రతల విభాగం ఎడిజి దల్జిత్ చౌదరి లక్నోలో చెప్పారు.