జాతీయ వార్తలు

విలీనానికి చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 20: తమిళనాడులో అధికార అన్నాడిఎంకె వైరి వర్గాల విలీనానికి మళ్లీ చుక్కెదురైంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం గురువారం కొత్త మెలిక పెట్టడంతో వ్యవహారం మొదటికొచ్చింది. వికె శశికళ, ఆమె బంధువు టిటివి దినకరన్‌లను లాంచనంగా బహిష్కరిస్తే తప్ప విలీనం చర్చయలు ముందుకు సాగవమని పన్నీర్ సెల్వం తెగేసి చెప్పారు. అలాగే జయలలిత మరణంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ, దినకరన్‌లను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ముందు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం దాఖలు చేసిన అఫిడవిట్లను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తమ మొదటి డిమాండ్ శశికళ, దినకరన్‌ల చేత రాజీనామా చేయించాలన్నదేనని, అనంతరం వారితోపాటు వారి కుటుంబానికి చెందిన 30మందిని బహిష్కరించాలన్నదేనని పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కెపి మున్నుస్వామి స్పష్టం చేశారు. ఈ షరతులన్నింటినీ ఆమోదిస్తే తప్ప రెండు వర్గాల విలీన చర్చలకు ఎలాంటి అవకాశం ఉండదన్నారు. శశికళ, దినకరన్‌లను తొలగిస్తూ పళనిస్వామి వర్గం ఇటీవల తీసుకున్న నిర్ణయం కూడా తమను మభ్య పెట్టాలన్న ఉద్దేశంతో కూడుకున్నదేననన్న అనుమానాన్ని మున్నుస్వామి వ్యక్తం చేశారు. ‘అసలు జరిగిందేమిటో పళనిస్వామికే తెలుసు.దినకరన్‌పై కేసులు పెరుగున్నాయి కాబట్టి ఆయన్ని తప్పించడానికే పళనివర్గాన్ని శశికళ వినియోగించుకున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉంది’అని అన్నారు. పార్టీ సంప్రదాయం ప్రకారం దినకరన్, శశికళలను బహిష్కరిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ కావాలని, వీరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పార్టీ శ్రేణులనూ కోరాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే పళనివర్గం చిత్తశుద్ధిని గుర్తిస్తామని చెప్పారు.