జాతీయ వార్తలు

మూత్రం తాగి తమిళ రైతుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: తమ సమస్యలు పరిష్కరించాలంటూ 39 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న తమిళనాడు రైతులు శనివారం మూత్రం తాగారు. అర్ధనగ్న ప్రదర్శనలు, శవయాత్రలు, కప్పలు, పాములను కొరకడం వంటి వినూత్న నిరసనలు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. రుణమాఫీ చేయాలని, రైతుల ఆత్మహత్యలు ఆపాలంటూ జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన 40వ రోజుకు చేరుకుంది. కేంద్రం పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో మూత్రం బాటిళ్లలోకి సేకరించి తాగి నిరసన తెలిపారు. పోలీసులు వారించినా వినకుండా ఆ నిరసన కొనసాగించారు. రైతుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న పి అయ్యక్కన్ను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. ‘39రోజులుగా జంతర్ మంతర్‌లో నిరసన తెలుపుతున్నాం. కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదు. మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. గత్యంతరం లేక మూత్రం తాగాం’ అని ఆయన వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మూత్రం తాగుతామని శుక్రవారమే అల్టిమేటం ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలో ఆందోళన వాయిదా వేసుకుని రైతు సమస్యలపై ఈ నెల 25న జరిగే తమిళనాడు బంద్‌లో పాల్గొనాలని డిఎంకె కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ పిలుపునిచ్చారు. కరవుప్రాంత రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీలు బంద్‌ను చేపట్టనున్నాయి. కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీల నాయకులతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 25న రాష్ట్ర బంద్ పాటించాలని ఓ తీర్మానం చేసినట్టు డిఎంకె చీఫ్ మీడియాకు వెల్లడించారు.

చిత్రం..ఆందోళనలో భాగంగా శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూత్రం తాగి
నిరసన తెలుపుతున్న తమిళనాడు రైతులు