జాతీయ వార్తలు

ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ ఎదుట హాజరైన దినకరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అన్నాడిఎంకె పార్టీ గుర్తయిన రెండాకుల గుర్తును తమ వర్గానికి లభించేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపారన్న ఆరోపణపై శశికళ మేనల్లుడు శుక్రవారం ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. శనివారం ఉదయం చెన్నైనుంచి ఢిల్లీ వచ్చిన దినకరన్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఢిల్లీ పోలీసు క్రైమ్‌బ్రాంచ్ ఇంటర్‌స్టేట్ విభాగం కార్యాలయానికి వచ్చారు. కాగా, అధికారులు ఆయనను రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. ఆదివారం మరోసారి దినకరన్‌ను ప్రశ్నిస్తారని, ఒకవేళ ఆయన సమాధానాలు సంతృప్తికరంగా లేనిపక్షంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయవచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. విచారణకు సహకరించాల్సిందంటూ ఢిల్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి సమయంలో చెన్నైలోని దినకరన్ నివాసంలో ఆయనకు సమన్లు అందజేశారు. దినకరన్ ఎన్‌ఆర్‌ఐ అయినందున దేశం వదిలిపెట్టి పోయే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు మంగళవారం ఆయనపై లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. దినకరన్ వర్గానికి రెండాకుల గుర్తు కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులతో రూ. 50 కోట్లకు ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నారనే ఆరోపణతో పోలీసులు అంతకుముందు సుకేశ్ చంద్రశేఖర్ అనే మధ్యవర్తిని అరెస్టు చేయడం తెలిసిందే. ఇదిలా ఉండగా, దినకరన్ విచారణ సందర్భంగా చాణక్యపురిలోని క్రైమ్‌బ్రాంచ్ కార్యాలయం చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. మీడియా వారిని, చివరికి దినకరన్ తరఫు లాయరును సైతం లోపలికి అనుమతించలేదు.

చిత్రం..ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయేందుకు వస్తున్న ఎఐఎడిఎంకె నేత దినకరన్