జాతీయ వార్తలు

కారు చౌకగా విమానయానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, ఏప్రిల్ 27: విమాన ప్రయాణం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ ధరల్లో దేశీయంగా ప్రయాణించేందుకు రూపొందించిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్)’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా సబ్సిడీ పై నడిపించే 42 సీట్ల ఏటిఆర్ విమానం తొలి ప్రయాణాన్ని సిమ్లా నుంచి న్యూఢిల్లీకి పయనమైంది. దీంతో పాటే కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్‌ల మధ్య ఆర్‌సిఎస్ విమానాలను మోదీ ప్రారంభించారు. తరువాత ముంబయి-నాందేడ్‌ల మధ్య ఉడాన్ పథకం కింద విమానాలు నడుస్తాయని ఆయన స్వయంగా ప్రకటించారు. ఉడాన్ పథకం కింద 45 అన్ రిజర్వ్‌డ్, ఉపయోగంలో లేని విమానాశ్రయాలు తిరిగి పనిచేయటం ప్రారంభిస్తాయి. ఈ విమానాల్లో ప్రయాణానికి గంటకు 2500రూపాయల ధరతో ప్రయాణించవచ్చు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘‘హవాయి చప్పల్(రబ్బర్ స్లిప్పర్లు) వేసుకునే వాళ్లు హవాయి జహాజ్(విమానం)లో ప్రయాణించాలన్నదే నా కోరిక. విమాన ప్రయాణం అంటే ఏ రాజా మహారాజాలో, లేక ఉన్నత స్థాయి వర్గాల వారికి మాత్రమే పరిమితం అనేవారు. ఎయిరిండియా మస్కట్(గుర్తు) కూడా మహారాజాదే ఉంటుంది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీతో ఈ విషయాన్ని నేను ఆనాడే ప్రస్తావించాను. ఎయిరిండియా గుర్తు మహారాజా కాకుండా ఆర్కే లక్ష్మణ్ కార్టూన్‌లోని ప్రసిద్ధమైన కామన్ మ్యాన్ ఉండాలని.’’ అని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం తగ్గటం వల్ల ప్రధానంగా యువతకు ఎంతో మేలు
జరుగుతుందని, దీని కారణంగా భారత ముఖచిత్రం మార్చే అవకాశం వారికి లభిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. 70 ఏళ్లలో పౌర విమాన యానానికి సంబంధించి ఎలాంటి విధానం లేదని, ఇప్పుడు తమ ప్రభుత్వానికి ఆ అవకాశం లభించిందని మోదీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దేశ వ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు నిర్మించినా, అవి ఉపయోగపడకుండా పోయాయని మోదీ తెలిపారు. ఇలాంటి వాటిలో 30 విమానాశ్రయాలను వాణిజ్యపరంగా, ప్రయాణికులకు సౌకర్యార్థం వినియోగించాలని విధాన నిర్ణయం తీసుకున్నామయన్నారు. ‘‘్ఢల్లీ-సిమ్లా విమాన ప్రయాణం టాక్సీ కంటే తక్కువ చార్జీ అవుతుంది. ఒక టాక్సీలో ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్లాలంటే 9గంటలు పడుతుంది. కిలోమీటర్‌కు పది రూపాయలు ఖర్చవుతుంది. కానీ విమానంలో కిలోమీటర్‌కు ఆరు నుంచి 7 రూపాయల్లో ఢిల్లీ నుంచి సిమ్లాకు అతి తక్కువ సమయంలో వెళ్లిపోవచ్చు.’ అని మోదీ పేర్కొన్నారు. నాందేడ్ సాహిబ్, అమృత్‌సర్ సాహిబ్, పాట్నాసాహిబ్‌ల మధ్య సర్క్యులర్ రూట్‌ను ఏర్పాటు చేస్తామని మోదీ తెలిపారు. ఉడాన్ స్కీం కింద 2టయర్, 3టయర్ నగరాల మధ్య విమానయానం ద్వారా అనుసంధానం జరుగుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఉడాన్ విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తరువాత బిలాస్‌పూర్ హైడ్రో ఇంజనీరింగ్ కాలేజికి శంకుస్థాపన చేశారు. హైడ్రో పవర్ రంగంలో 1.5లక్షల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, కేంద్ర మంత్రులు జెపినడ్డా, అశోక్ గజపతి రాజు, జయంత్ సిన్హా పాల్గొన్నారు.

చిత్రం..సిమ్లాలో గురువారం ఉడాన్ పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ