జాతీయ వార్తలు

లంచగొండితనంలో ఏపీకి రెండో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశ వ్యాప్తంగా అవినీతి, లంచగొండితనంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 20 రాష్ట్రాలలో అవినీతి, లంచగొండితనంపై ఇండియన్ కరప్షన్ స్టడీ పేరుతోమీడియా స్టడీస్ సెంటర్ (సీఎంఎస్) సంస్థ చేసిన సర్వే వివరాలను ఆ సంస్థ ఢిల్లీలో విడుదల చేసింది. ముఖ్యంగా ప్రజాసేవలో వివిధ రాష్ట్రాలలోని రాజధాని ప్రాంతాలలో, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వివిధ కుటుంబాల సమాచారం సేకరించి ఈ సర్వేను నిర్వహించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ, బ్యాకింగ్, విద్యుత్, పోలీస్, ఆరోగ్యం, న్యాయవ్యవస్థ, విద్య, భూములు, గృహనిర్మాణం, నీటి సదుపాయాలు, పన్నుల విభాగంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనంపై జరిపిన వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అవినీతీ, లంచగొండితనంలో ఏపీ 74 శాతంతో రెండో స్థానంలో నిలవగా, మొదటి స్థానంలో 77 శాతంతో కర్ణాటక రాష్ట్రం దక్కించుకుంది. మూడో స్థానంలో తమిళనాడు, నాలుగవ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. ఏడాదికి ఒక కుటుంబం ప్రభుత్వ సేవల కోసం సాగటునా రూ.1840 లంచం ఇవ్వాల్సి వస్తుందని ఈ సంస్థ పేర్కొంది. రేషన్ కార్డు మంజూరు మొదలు స్కూల్ అడ్మిషన్లు, వివిధ పనుల కోసం 20 రూపాయిల నుంచి 50 వెల రూపాయల వరకు ప్రజలు, ప్రభుత్వ సేవల కోసం అధికారులు లంచం ఇవ్వాల్సి వస్తుందని సర్వేలో వెల్లడించింది. గడిచిన సంవత్సరం కంటే దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాలలో 30 శాతం అవినీతి పెరిగిందని ఈ సంస్థ పేర్కొంది. అనంతరం సిఎంఎస్ సంస్థ చైర్మన్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఏపీలో అన్ని విభాగాల్లో అవినీతి పెరిగిందని, ముఖ్యంగా రెవెన్యూ, భూ వ్యవహారాలలో ఇది బాగా పెరిగిందని వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకొని సమర్థవంతంగా పనిచేస్తే అవినీతి నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.