జాతీయ వార్తలు

వాఘా చెక్‌పోస్టు వద్ద అతిపెద్ద జాతీయ పతాకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ-వాఘ జాయింట్ చెక్‌పోస్టు వద్ద 350 అడుగుల జాతీయ పతకాన్ని బిఎస్‌ఎఫ్ ఏర్పాటు చేయనుంది. అంతేకాదు పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి చూస్తే కనిపించేటంత ఎత్తులో త్రివర్ణ పతకం కొలువుతీరనుంది. అట్టారీ-వాఘ సరిహద్దులోనే బిఎస్‌ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు రిట్రీట్ నిర్వహిస్తుంటారు. దేశ భక్తిని చాటుతూ, భారత కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టినట్టు బిఎస్‌ఎఫ్ సీనియర్ అధికారులు వెల్లడించారు. రిట్రీట్ సందర్భంగా జాయింట్ చెక్‌పోస్టు(జెసిపి) వద్ద విజిటర్స్ గ్యాలరీని ఆధునీకరించనున్నట్టు వారు తెలిపారు. పర్యాటకులు ఎక్కువ మంది వచ్చినప్పుడు స్థల ప్రభావం ఉండడం వల్ల గ్యాలరీని విస్తరించే ఆలోచన ఉందన్నారు. ప్రస్తుతం గ్యాలరీ సామర్థ్యం 7000 మాత్రమే. విస్తరణలో భాగంగా 20వేలకు పెంచాలని పెంచడంతోపాటు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్టు బిఎస్‌ఎఫ్ ప్రకటించింది. ఇప్పుడు వాఘ సరిహద్దులో ఏర్పాటు చేస్తున్న జాతీయ పతాకం దేశంలోనే అతిపెద్దదిగా చెప్పవచ్చు.