జాతీయ వార్తలు

ట్రంప్‌ను నమ్ముతున్నవారు 25 శాతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నారని యుక్తవయస్కులైన అమెరికన్లలో కేవలం 25 శాతం మంది మాత్రమే నమ్ముతున్నారు. ‘టైమ్-సర్వే మనీ’ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఈ విషయం వెల్లడయింది. ట్రంప్ తన హామీలను నిలబెట్టుకుంటున్నారని కొద్దిమంది మాత్రమే నమ్ముతుండగా, ఆయన మద్దతుదారుల్లో ఎక్కువమంది మాత్రం ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను ఆయన పాటిస్తున్నారని భావిస్తూ ఉండడం గమనార్హం. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి త్వరలో వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన మద్దతుదారులు ఏమనుకుంటున్నా తెలుసుకోవడానికి ఈ సర్వేను నిర్వహించినట్లు ‘అపోజింగ్‌వ్యూస్ డాట్ కామ్’ పేర్కొంది. ఈ నెల 29తో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వందరోజులు పూర్తి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ నెల 24న ఈ సర్వే నిర్వహించారు. ట్రంప్ మాట నిలబెట్టుకునే వ్యక్తి అని భావించేవారు ఆరుశాతం తగ్గినట్లు ఈ సర్వే గణాంకాలను బట్టి తెలుస్తోందని ఆ కథనం పేర్కొంది.