జాతీయ వార్తలు

రైల్వేలను ప్రైవేటీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ప్రజారవాణా వ్యవస్థ అయిన రైల్వేలను సామాన్యుడికి మరింత చేరువచేస్తామని గురువారం ఇక్కడ ప్రకటించారు. భవిష్యత్‌లో రైల్వే రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. సంస్థ నిర్వహణ భారం పెరిగిపోతున్నందున మున్ముందు ప్రైవేటీకరించే అవకాశం ఉందని వస్తున్న కథనాలను సురేష్ ప్రభు తోసిపుచ్చారు.
అలాంటి ఊహాగానాలే తప్పని, రైల్వేల ప్రైవేటీకరణ అన్నది దేశంలో జరగదని మంత్రి పేర్కొన్నారు. నిర్వహణ భారం పెరిగిపోతున్నప్పటికీ సామాన్యుడి ప్రజా రవాణా వ్యవస్థ అయిన రైల్వే రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రజా రవాణాగా పేరున్న రైల్వేలను కొనగోలు చేయడానికి ప్రైవేటు కంపెనీ ఏదీ ముందుకురాదని అన్నారు.