జాతీయ వార్తలు

సైనిక శిబిరంపై మిలిటెంట్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 27: జమ్మూ, కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పంజ్‌గావ్‌లోని సైనిక శిబిరంపై ముగ్గురు సాయుధ మిలిటెంట్లు దాడి చేసి ఒక కెప్టెన్‌ను, ఇద్దరు సైనికులను కాల్చి చంపారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ దాడి తర్వాత దాదాపు 35 నిమిషాలపాటు జరిగిన భీకర ఎన్‌కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతం కాగా, మరొకరు తప్పించుకున్నాడని శ్రీనగర్, న్యూఢిల్లీలోని ఆర్మీ అధికారులు చెప్పారు. ఎన్‌కౌంటర్ పూర్తయిన వెంటనే పెద్ద సంఖ్యలో చేరిన స్థానికులు అంత్యక్రియలు జరపడం కోసం మిలిటెంట్ల శవాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సైనికులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారని, అది ఘర్షణకు దారి తీయడంతో బులెట్ తగిలి 75 ఏళ్ల పౌరుడు మృతి చెందాడని వారు చెప్పారు. సాయంత్రం 4 గంటల సమయంలో నల్లరంగు పఠానీ సూట్లు, బులెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన ముగ్గురు మిలిటెంట్లు పంజ్‌గావ్ వద్ద ఉన్న ఆర్మీ ఆర్టిలరీ యూనిట్‌లోకి వెనుకవైపునుంచి ప్రవేశించారు. పర్వతాల మధ్య ఉన్న ఈ శిబిరంలోని రెండో సెక్యూరిటీ వలయాన్ని దాటి వచ్చిన మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ దాదాపు వందమంది ఉండే ఆఫీసర్స్ క్యాంప్‌లోకి చొరబడడానికి ప్రయత్నించారని అధికారులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన సైనికులు మిలిటెంట్లను దీటుగా ఎదుర్కొన్నారు. సైనికులకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో కెప్టెన్ ఆయుష్ యాదవ్, సుబేదార్ భూప్ సింగ్ గుజ్జార్, నాయక్ బి వెంకటరామన్న చనిపోగా, గాయపడిన అయిదుగురు సైనికులను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతం కాగా, మరొకఢు తప్పించుకున్నాడు. మొత్తం ఆపరేషన్ 35 నిమిషాల్లో ముగిసిందని కుప్వారాలో కల్నల్ సౌరభ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన కెప్టెన్ యాదవ్ మూడేళ్ల క్రితం సైన్యంలో చేరగా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నానికి చెందిన 38 ఏళ్ల వెంకటరామన్న 18 ఏళ్లు, గుజ్జార్ 26 ఏళ్లుగా సైన్యంలో ఉన్నారు.