జాతీయ వార్తలు

ఇంత జాప్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏవో కారణాలు చూపి పెండింగ్‌లో ఉంచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2013 లోక్‌పాల్, లోకాయుక్త చట్టం కింద లోక్‌సభలో ప్రతిపక్ష నేతను లోక్‌పాల్ సెలక్షన్ ప్యానెల్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడే లేని పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు ఇదే కేసును విచారించిన సుప్రీం కోర్టు కేంద్రం తీరును తప్పుపట్టింది. లోక్‌పాల్ నియమకాలు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌పై వాదోపవాదలు విన్న సుప్రీం కోర్టు మార్చి 28న తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. కామన్ కాస్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ అడ్వొకేట్ శాంతి భూషణ్ వాదిస్తూ 2013లో పార్లమెంట్ లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం తెలిపిందని, 2014నుంచి అమల్లోకి వచ్చిందని బెంచ్ దృష్టికి తెచ్చారు. ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్ నియామకాలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అయితే అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గి ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరై తన వాదన వినిపించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేకపోవడంవల్లే పెండింగ్‌లో ఉండిపోయిందని బెంచ్‌కు తెలిపారు. గత ఏడాది నవంబర్ 23న లోక్‌పాల్ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు జరపాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ‘కామన్‌కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. నిబంధనల ప్రకారం చైర్‌పర్సన్, సభ్యులను నియమించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు.