జాతీయ వార్తలు

అయోధ్యలో మళ్లీ ‘రామ్ లీల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 27: అయోధ్యలో అనేక ఏళ్ల క్రితం నిలిపివేసిన సంప్రదాయ రామ్ లీల నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నాటకాన్ని గతంలో ప్రదర్శించేవారు. అలాగే మథురలో రాస్ లీల కార్యక్రమాన్ని, చిత్రకూట్‌లో భజన్ సంధ్యా కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా సిఎం ఆదేశించారు. రిలీజియస్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ బుధవారం ఇక్కడ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ మూడు కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు ఒక అధికారి గురువారం తెలిపారు. రాంలీలా అనేది రామాయణం ఆధారంగా శ్రీరాముడి జీవిత చరిత్రను వివరించే నాటకం. అయోధ్యలో ప్రతి ఏటా దసరా వేడుకల సందర్భంగా ప్రదర్శించే రామ్ లీల నాటకాన్ని చాలా ఏళ్ల క్రితం నిలిపివేశారని ఆ అధికారి చెప్పారు. అదేవిధంగా రాస్ లీల అనేది శ్రీకృష్ణుడి జీవిత చరిత్రను వివరించే జానపద నృత్య నాటకం. దీనిని ఈ సంవత్సరం నుంచి మథురలో ప్రదర్శించనున్నారు. భజన్ సంధ్య అనేది భక్తిగీతాల ఆలాపన కార్యక్రమం. దీనిని ఈ ఏటి నుంచి చిత్రకూట్‌లో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారణాసిలోని కాశి విశ్వనాథ ఆలయంలో ఈ-పూజ, ఈ-విరాళాలను ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కైలాస్ మానససరోవర్ యాత్ర, సింధు యాత్రకు ఆన్‌లైన్ దరఖాస్తు వ్యవస్థను, ఈ-జిల్లా పోర్టల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కూడా సిఎం ఆదేశించారు. వీటిని 15 రోజుల్లోగా ప్రారంభించాలని ఆదేశించారు. ప్రముఖ దేవస్థానాలకు నాలుగు లేన్ల అప్రోచ్ రోడ్లను నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అయోధ్యలో రూ. 14.77 కోట్ల వ్యయంతో భజన్ సంధ్య వేదికను నిర్మించటానికి 2018 జూన్‌ను గడువుగా సిఎం నిర్దేశించారు. చిత్రకూట్‌లో రూ.13.75 కోట్లతో భజన్ సంధ్య, పరిక్రమ వేదిక నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.