జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు మహిళా పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కాశ్మీర్‌లోయలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. జమ్ము కాశ్మీర్ పోలీస్ దళంలోకి వెయ్యి మంది మహిళలతో బలమైన ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మహిళా పోలీసులు అయిదు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌లలో భాగంగా ఉంటారు. కాశ్మీర్‌లో ఇటీవల అయిదు ఐఆర్‌బిలకు సంబంధించి అయిదు వేల పోస్టులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల్లో చేరేందుకు 1.40లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 40శాతం మంది కాశ్మీర్‌కు చెందినవారే కావటం గమనార్హం. ఒక్కో పోస్టుకు కనీసం 30 మంది పోటీ పడుతున్నారు.
మహిళా పోలీసు బెటాలియన్ ప్రధానంగా రాళ్ల దాడుల వంటి ఘటనలను ఎదుర్కొంటుంది. దీంతోపాటు ఇతర శాంతిభద్రతల అంశాలనూ పర్యవేక్షిస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 2015లో ప్రధానమంత్రి మోదీ కాశ్మీర్‌కు ప్రకటించిన 80వేల కోట్ల ఆర్థిక ప్యాకేజి పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని కమిటీ గురువారం చర్చించింది. ఇందులో భాగంగానే ఐఆర్‌బిలో మహిళా బెటాలియన్ అంశం చర్చకు వచ్చింది. 60శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు ఇవ్వాలని, కొత్త బెటాలియన్‌లను రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో మోహరించాలని నిర్ణయించారు. ఒక్కో బెటాలియన్ ఏర్పాటుకు 61 కోట్లరూపాయల ఖర్చు అవుతుంది. ఇందులో 75శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 144 రిజర్వ్ బెటాలియన్లు ఉన్నాయి. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో రాష్ట్రానికి 4బెటాలియన్ల చొప్పున పెంచారు. 12 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో 5చొప్పున కేటాయించారు.

చిత్రం..కాశ్మీర్‌కు ఆర్థిక ప్యాకేజీపై చర్చించేందుకు గురువారం ఢిల్లీలో సమావేశమైన కమిటీ