జాతీయ వార్తలు

నాపై కాంగ్రెస్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 27: ‘కాషాయ ఉగ్రవాదం’లో తన పాత్రను అంగీకరించేలా చేయడానికి ముంబయి ఎటిఎస్ తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసిందని 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో బెయిలుపై విడుదలైన సాధ్వి ప్రగ్యాసింగ్ ఆరోపించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బెయిలుపై జైలునుంచి విడుదలైన ఆమె గురువారం తొలిసారిగా విలేఖరులతో మాట్లాడారు. ‘తొమ్మిదేళ్లుగా నేను జైల్లో ఉన్నాను. నా అభిప్రాయాలను బైటికి చెప్పడానికి నాకు అవకాశం లభించలేదు. 2008లో నా అరెస్టు కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగం. ఈ కుట్రకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను’ అని ఆమె చెప్పారు. అంతేకాదు దేశంలో ‘కాషాయ ఉగ్రవాదం’ ఉందని చెప్పిన కేంద్ర మాజీ హోం మంత్రి పి చిదంబరాన్ని సైతం ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది కాంగ్రెస్ కుట్ర అనేది సుస్పష్టం. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వం నాపై ఎలాంటి కుట్ర పన్నదని, న్యాయం జరిగేలా చూడడానికి ప్రయత్నిస్తుందనేది ఖాయం’ అని ఆమె అన్నారు.
మిమ్మల్ని విడుదల చేయించడంలో మోదీ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించిందా అని విలేఖరులు అడగ్గా, ఆమె తరఫులాయరు జోక్యం చేసుకొని 2015 ఏప్రిల్ 12న సాధ్వి ప్రగ్యాసింగ్‌పై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం (మొకోకా) కింద అభియోగాలను సుప్రీంకోర్టు ఉపసంహరించింది, అందువల్ల ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వాన్ని తీసుకురావడం సరికాదని అన్నారు.
ముంబయి ఎటిఎస్ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రగ్య 2008 అక్టోబర్ 10న ఎటిఎస్ తనను సూరత్‌లో అరెస్టు చేసి ముంబయికి తీసుకు వచ్చిందని చెప్పారు. ‘వాళ్లు నన్ను 13 రోజులపాటు అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు’ అని కూడా ఆమె ఆరోపించారు. ‘ఖన్విల్కర్, పరంబీర్ సింగ్ (దివంగత) హేమంత్ కర్కరే -అందరూ మగవారే- నన్ను చిత్రహింసలు పెట్టారు. స్వాతంత్య్రానికి ముందుకానీ తర్వాత కానీ నన్ను హింసించినంతగా ఏ మహిళనూ హింసించి ఉండరు’ అని కూడా ఆమె అన్నారు. అరెస్టు కావడానికి ముందు తాను శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉన్నానని, ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నానని, ఎటిఎస్ చిత్రహింసలే దీనికి కారణమన్నారు.