జాతీయ వార్తలు

ఢిల్లీలో నేతాజీ స్మారక భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన 25 రహస్య ఫైళ్లను ప్రభుత్వం బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ పేరుతో ఓ స్మారక మందిరం నిర్మించనున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. 1956 నుంచి 2009 సంవత్సరానికి సంబంధించి ఐదు ఫైళ్లను పిఎంఓ ఆఫీసు, ఐదు ఫైళ్లు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ, 15 ఫైళ్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద అందుబాటులో ఉంచినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.‘దేశ ప్రజలు ముఖ్యంగా యువత నేతాజీ జీవిత విశేషాలు, దేశం కోసం ఆయన చేసిన సేవలు తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నారు. అలాంటి వారికి ఇది సువర్ణ అవకాశం. బోస్ గురించి ఏన్నో విషయాలు తెలుకుకునే అవకాశం కలిగింది’ అని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలు, పార్లమెంటేరియన్ల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఢిల్లీలో నేతాజీ స్మారక మందిరం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ పాత్ర, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, జీవిత విశేషాలు ప్రజలు తెలియాల్సి ఉందన్నారు. జపాన్ వద్ద ఉన్న నేతాజీకి చెందిన రెండు రహ స్య ఫైళ్లు బహిరంగ పరచడానికి ఆ దేశం అంగీకరించిందని మంత్రి వెల్లడించారు. అయితే మిగతా మూడు ఫైళ్లు విషయం పై జపాన్ నుంచి ఎలాంటి హామీ లభించలేదని అన్నారు.