జాతీయ వార్తలు

కేంద్ర సిబ్బందికి మరో బొనంజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అలవెన్సులపై పది నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఇంటిఅద్దె అలవెన్సు(హెచ్‌ఆర్‌ఏ) గరిష్ఠంగా 178 శాతం పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. అలవెన్సులపై ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా నేతృత్వంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తన నివేదికను సమర్పించింది. ఇప్పుడున్న హెచ్‌ఆర్‌ఏ రేట్లను మార్చవద్దని సిఫార్సు చేయడం ద్వారా ఈ కమిటీ ఉద్యోగులకు అనుకూలంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమయితే ఉద్యోగుల పంట పండినట్లే. 47 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 53 లక్షల మంది పెన్షనర్లకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. నగరాల స్థాయి ఆధారంగా హెచ్‌ఆర్‌ఏను 2నుంచి ఆరు శాతం దాకా తగ్గించాలంటూ ఏడవ వేతన సంఘం సిఫార్సు చేయడం ప్రధానంగా ఉద్యోగులకు కలవరపెడుతూ ఉంది. ఆరోవేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు ఉద్యోగులకు బేసిక్ వేతనంలో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభిస్తోంది.
అయితే దీన్ని 24 శాతానికి తగ్గించాలని ఎకె మాథుర్ నేతృత్వంలోని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. వాస్తవానికి ఎక్స్, వై, జడ్ తరగతి నగరాల్లో హెచ్‌ఆర్‌ఏను వరసగా 24, 16, 8 శాతానికి పరిమితం చేయాలని వేతన సంఘం సిఫార్సు చేసింది. అంతేకాకుండా మొత్తం 196 అలవెన్సుల్లో 53 అలవెన్సులను రద్దు చేయాలని, మరో 36 అలవెన్సులను ఇప్పుడున్న వాటిలో విలీనం చేయాలని కూడా ఏడవ వేతన సంఘం తన సిఫార్సుల్లో సూచించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో అలవెన్సులపై ఏడోవేతన సంఘం చేసిన సిఫార్సులను సమీక్షించడం కోసం లావాసా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ఇప్పుడు కార్యదర్శుల స్థాయి సాధికారిక కమిటీ పరిశీలించిన తర్వాత మంత్రివర్గం ముందుకు వెళ్తుంది.