జాతీయ వార్తలు

వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తేలేదని కేంద్రం స్పష్టం చేసింది. వేర్పాటువాదులు గానీ, ఆజాదీ కోసం డిమాండ్ చేస్తున్న సంస్థలతోగానీ సంప్రదింపుల ఉద్దేశమేలేదని సుప్రీం కోర్టుకు తెలిపింది. పెల్లెట్ గన్స్‌ను వాడడానికి సవాల్ చేస్తూ జమ్మూకాశ్మీర్ బార్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి హురియత్ నేతలతో కేంద్రం చర్చలు జరపాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బార్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ప్రజల పక్షాన చట్టపరంగా ఎవరైనా చర్చలకు వస్తే పరిశీలిస్తామని, అయితే వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తేలేదని కేంద్రం తేల్చిచెప్పింది. కేంద్రంలో చర్చలకు సిద్ధంగా ఉన్న నేతల పేర్లు అమకు అందజేయాలని బార్ అసోసియేషన్‌కు ధర్మాసనం సూచించింది. చర్చల సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కాశ్మీర్‌లో పెలెట్(గుళికల)గన్స్ వాడకుండా ఆర్మీ, పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఆందోళన కార్యక్రమాల అణచివేత మిషతో భద్రతాదళాలు యధేచ్ఛగా పెలెట్ గన్స్‌ను వాడేస్తున్నాయని బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనకారులు రాళ్ల దాడులు ఆపేస్తామని స్పష్టమైన హామీ ఇస్తే తామూ పెలెట్ గన్స్ ఆపాలని పోలీసులకు చెప్పగలమని కేంద్రం పేర్కొంది. కేసును మే 9కి వాయిదా వేశారు.