జాతీయ వార్తలు

వ్యూహాలకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: సిఆర్‌పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రాయ్ భట్నాగర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ జరిపిన మెరుపుదాడిలో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందిన కొద్ది రోజులకే భట్నాగర్ పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన ప్రాధాన్యతలను ప్రకటించిన భట్నాగర్ ఆపరేషన్‌పరంగా, లాజిస్టిక్స్ పరంగా సిఆర్‌పిఎఫ్ ఎదుర్కొంటున్న సవాళ్లను సమీక్షించి వాటికి పరిష్కారం కనుగొనడం తన తొలి ప్రయారిటీ అని చెప్పారు. జకార్తాలో ఓ సదస్సులో పాల్గొని గురువారం రాత్రే తిరిగి వచ్చిన భట్నాగర్ శుక్రవారం ఉదయం ఢిల్లీలోని లోధీ రోడ్డులో ఉన్న సిఆర్‌పిఎఫ్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నూతన బాధ్యతలను స్వీకరించారు. గత ఫిబ్రవరి 28న కె దుర్గాప్రసాద్ రిటైరయినప్పటినుంచి గత రెండు నెలలుగా సిఆర్‌పిఎఫ్ డిజి పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. తాత్కాలిక డిజిగా వ్యవహరిస్తున్న సుదీప్ లక్టాకియా భట్నాగర్‌కు బ్యాటన్‌ను అందజేశారు. అనంతరం సిర్‌పిఎఫ్ జవాన్లనుంచి భట్నాగర్ గౌరవ వందనం స్వీకరించారు. 1983 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన 57 ఏళ్ల భట్నాగర్ ఇప్పటివరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. ఐఐఎం అహ్మదాబాద్‌నుంచి ఎంబిఏ పట్టా పొందిన భట్నాగర్ తన కేడర్ రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో అనేక హోదాల్లో పని చేశారు కూడా. భట్నాగర్ 32 నెలల పాటు సిఆర్‌పిఎఫ్ డిజిగా కొనసాగుతారు.ఆయన 2019లో రిటైర్ కావలసి ఉంది.