జాతీయ వార్తలు

ప్రభుత్వ కార్యాలయాలకు ఏ క్షణంలోనైనా ఫోన్ చేస్తా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 28: దేశంలోనే అత్యంత సమస్యాత్మకమైన ఉత్తరప్రదేశ్‌లో శాంతి, భద్రతలతో పాటు పరిపాలనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, అధికారులు నిరంతరం పనిచేసేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అధికారులను హెచ్చరిస్తూ ఆయన ప్రభుత్వం శుక్రవారం ఒక నోటీసు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ముఖ్యమంత్రి ల్యాండ్‌లైన్ ద్వారా ఏ సమయంలోనైనా ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్ చేస్తారని, ఆ సమయంలో అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో లేకుండా మరెక్కడైనా ఉండి ఆ ఫోన్‌కాల్‌ను స్వీకరించలేకపోతే శిక్షకు గురికావలసి ఉంటుందని ఆ నోటీసులో హెచ్చరించారు.
ఆదిత్యనాథ్ తరఫున ఆయన ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి శ్రీకాంత్ శర్మ ఈ హెచ్చరికను జారీ చేశారు. ఎప్పుడూ ఏదో ఒక ప్రదేశంలో తనిఖీలకో లేక జూనియర్ అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకో వెళ్లే సీనియర్ పోలీసు అధికారులకు ఈ కొత్త నిబంధన నుంచి కొంత వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్ల లాంటి సీనియర్ పరిపాలనాధికారులకు ఈ నిబంధనతో కష్టాలు తప్పేటట్టు లేదు. ఉన్నతాధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటే జూనియర్ అధికారులు కూడా వారిని అనుసరిస్తారని భావించి ఈ నిబంధనను తీసుకొచ్చిన ఆదిత్యనాథ్ ప్రభుత్వం, రాష్ట్రంలోని సీనియర్ అధికారుల్లో ఎవరైనా తమ ఇళ్లనే కార్యాలయాలుగా చేసుకుని పనిచేస్తున్నట్లయితే తక్షణమే అటువంటి పనులను మానుకుని ప్రతి రోజూ కార్యాలయాలకు వచ్చితీరాలని ఆదేశించింది.