జాతీయ వార్తలు

నాకూ బెయిల్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితుడు శ్రీకాంత్ పురోహిత్ బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మాజీ లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్‌కు బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అన్ని పిటిషన్లలానే విచారణ జరుతాము తప్ప అత్యవసరంగా చేపట్టలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ నేతృత్వంలోన ధర్మాసనం స్పష్టం చేసింది. అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థననలు కోర్టు తోసిపుచ్చింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈనెల 25న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసి పురోహిత్‌కు నిరాకరించింది. తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆయన ఆరోపించారు. 2008 సెప్టెంబర్ 29న జరిగిన మాలేగావ్ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. మోటర్ సైకికల్‌కు అమర్చిన బాంబు పేలి విధ్వంసం సృష్టించింది. అదే ఏడాది సాధ్వీ ప్రజ్ఞ, 44 ఏళ్ల పురోహిత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సాధ్వీ కేన్సర్ బారిన పడడంతో మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పురోహిత్‌ను మహారాష్టల్రోని తలోజా జైలుకు తరలించారు. కేసును విచారించిన బాంబే హైకోర్టు ప్రజ్ఞాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత పూచికత్తు చెల్లించాలని, పాస్‌పోర్టును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మాజీ లెఫ్టినెంట్ కల్నల్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ ఇవ్వలేమని బెంచ్ స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ దర్యాప్తు నివేదికను హైకోర్టు ప్రస్తావించింది.