జాతీయ వార్తలు

రాష్ట్రాలే నిర్ధారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: రైతు ఆదాయంపై పన్ను విధించాలా వద్దా అనే విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలంటూ నీతి ఆయోగ్ సభ్యు డు బిబేక్ దేబ్‌రాయ్ సూచించడం ఈ వివాదం తలెత్తడానికి ప్రధాన కార ణం. కాగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే యోచన లేదని, వ్యవసాయాదాయంపై పన్ను విధించే అధికారం కేంద్రానికి లేదంటూ వివరణ ఇవ్వడం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ సైతం తన వ్యాఖ్యలతో ఈ చర్చను కొత్త మలుపుతిప్పారు. వ్యవసాయాదాయంపై పన్ను విధించే వీలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా పేద రైతులు, సంపన్న రైతులకు మధ్య తేడాను నిర్ధారించాలని అరవింద్ సుబ్రమణ్యన్ శుక్రవారం ఇక్కడ అన్నారు. ‘న్యాయపరంగా చూసినట్లయితే వ్యవసాయాదాయంపై పన్ను విధించకుండా రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డుకునేది ఏదీ లేదు. వ్యవసాయాదాయంపై పన్ను విధించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగం అడ్డుకుంటోంది’ అని ఆయన అన్నారు.
అయితే ముందుగా పేద రైతులు ఎవరో, ధనిక రైతులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యం అన్నారు. అయితే ఇది చాలా కష్టమైన పనని, ఎందుకంటే రైతు గురించి మాట్లాడితే చాలు పేద రైతుల వెంట పడుతున్నారని జనం అనుకోవడం మొదలు పెడతారని కూడా ఆయన అన్నారు. ‘ఈ తేడాలను నిర్ధారించకుండా చేస్తున్నది ఇలాంటి రాజకీయ చర్చలే. ఎక్కడినుంచి ఆదాయం లభిస్తుందనే దానితో సంబంధం లేకుండా సంపన్నులందరిపై పన్ను వేయాలని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం’ అని సుబ్రమణ్యన్ ప్రశ్నించారు.