జాతీయ వార్తలు

దేశంలో ప్రతి వ్యక్తీ ముఖ్యుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ‘దేశంలో విఐపిలంటూ ఎవరూ లేరని, అందరూ ఇపిఐలే’నని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివా రం ఉద్ఘాటించారు. కొంతమంది వ్యక్తుల్లో ఉన్న విఐపి సంస్కృతిని పోగొట్టి దాని స్థానంలో ఇపిఐ(ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వ్యక్తే) అనే సంస్కృతిని ప్రవేశపెట్టడమే వాహనాలపై ఎర్రబుగ్గ వాడకాన్ని నిషేధించడం వెనుక ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. మే 1వ తేదీనుంచి ఎర్రబుగ్గ వాడకాన్ని నిషేధించాలని కేంద్ర మంత్రివర్గం ఈ నెల 19న నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు వాడే వాహనాలతో పాటుగా అన్ని ప్రభుత్వ వాహనాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. ‘ఎర్రబుగ్గ అనేది విఐపి సంస్కృతికి గుర్తుగా మారింది. దాన్ని వాడే వ్యక్తుల మనస్సుల్లోకి సైతం అది ప్రవేశించింది. ప్రతి వ్యక్తీ ముఖ్యుడే.. దేశంలోని 125 కోట్ల మందీ ముఖ్యమైన వారే’నని అంటూ అందుకే విఐపి సంస్కృతి పోయి దాని స్థానంలో ఇపిఐ (ఎవ్విరీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్) సంస్కృతిని తీసుకు రావడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ప్రతి నెలా చేసే రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ప్రసంగం ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఎర్రబుగ్గ పోయినంతమాత్రాన మనసులోకి చొరబడిన విఐపి సం స్కృతి కూడా పోయిందని ఎవరూ అనలేరని ఆయన అన్నారు. ఎర్రబుగ్గను నిషేధించడం అనేది పాలనాపరమైన చర్య మాఅతమేనని మనస్సులోని విఐపి సంస్కృతిని కూడా పోగొట్టాలంటే అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మరింతగా నగదు రహిత లావాదేవీలు జరపాలని మన్‌కీ బాత్‌లో కోరిన మోదీ మే 5న జరిపే సార్క్ ఉపగ్రహ ప్రయోగం ప్రాధాన్యత గురించి తెలియజేయడంతో పాటుగా వేసవి సెలవులను కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని విద్యార్థులను కోరారు.
డిజిటల్ లావాదేవీల ద్వారా ఆదాయం
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన ‘్భమ్’ యాప్‌ను ఉపయోగించాలని ఇతరులను ప్రోత్సహించడం ద్వారా ఆదాయాన్ని పొందాలని ప్రధాని యువతకు సూచించారు. ఈ పథకం అక్టోబర్ 14 వరకు అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఈ పథకం కింద ఒక వ్యక్తి భీమ్ యాప్‌ను మరో వ్యక్తికి పరిచయం చేసి, ఆ వ్యక్తి మూడు డిజిటల్ లావాదేవీలు జరిపిన ప్రతిసారి మొదటి వ్యక్తికి రూ 10 లభిస్తుంది. ఉదాహరణకు ఒక వేళ మీరు ఒక రోజులో 20 మంది ఆ పని చేసేలా చేశారంటే రోజుకు రూ. 200లు సంపాదిస్తారు’ అని మోదీ అన్నారు. అంతేకాకుండా దేశాన్ని డిజిటల్ ఇండియా వైపునకు మళ్లించడానికి జరిపే కృషికి సైతం ఇది తోడ్పడుతుందని ఆయన అన్నారు.
సార్క్ ఉపగ్రహం ఓ అమూల్య కానుక
మే 5న మన దేశం దక్షిణాసియా ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ప్రకటించిన మోదీ ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’లో భాగంగా మన పొరుగు దేశాలకు భారత్ అందిస్తున్న అమూల్యమైన కానుక అని అభివర్ణించారు. ‘సార్క్’లోని ఎనిమిది దేశాల్లో ఒక్క పాక్ తప్ప మిగతా ఏడు దేశాలు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవడానికి అంగీకరించాయి. ఈ ప్రాజెక్టులో పా లు పంచుకొంటున్న దేశాల అభివృద్ధిలో ఈ ఉపగ్రహం ఎంతో తోడ్పడుతుందని ఆయన చెప్పారు. దక్షిణాసియా పట్ల మన నిబద్ధతకు ఇది ఒక చక్కటి ఉదాహరణ అని మోదీ అన్నారు. కాగా, వేసవి సెలవులను కొత్త విషయాలను తెలుసుకోవడానికి, తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని ఆయన విద్యార్థి లోకాన్ని కోరారు. అలాగే వేసవి కాలంలో ఎండ వేడిమినుంచి పశుపక్ష్యాదులను కాపాడాల్సిన ఆవశ్యకత గురించి కూడా ప్రధాని తన ‘మన్‌కీ బాత్’లో ప్రస్తావించారు.