జాతీయ వార్తలు

తాగుబోతు భర్తలను తన్ని తగలెయ్యండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 30: నవ దంపతులను ఆశీర్వదిస్తూ వారికి బహుమతులను ఇవ్వడంలో మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ తన ‘విలక్షణత’ను చాటుకున్నారు. సామూహికంగా వివాహాలు చేసుకున్న దాదాపు 700 మంది నవ వధువులకు ఆయన ‘మోగ్రి’ (చెక్కతో చేసిన బ్యాట్)లను బహూకరించారు.
అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా సాగర్ జిల్లా గర్హకోట పట్టంలో శనివారం సామూహికంగా వివాహాలు చేసుకున్న దాదాపు 700 మంది నవ వధువులకు ఆయన వీటిని అందజేశారు. సాధారణంగా బట్టలు ఉతికేందుకు ఉపయోగించే వీటిని భర్తలు తాగి వచ్చినా, వేధింపులకు గురిచేసినా, దురలవాట్లను మానుకునేందుకు నిరాకరించినా వారి భరతం పట్టేందుకు ఉపయోగించాలని ఆయన నవ వధువులకు సూచించి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. పైపెచ్చు ఈ మోగ్రీలపై ప్రత్యేకంగా ఒక క్యాప్షన్ కూడా ఉంది. ‘తాగుబోతు భర్తలను తన్నడానికే దీనిని బహుమతిగా ఇస్తున్నా. ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోరు’ అన్నది ఆ క్యాప్షన్ సారాంశం. దీంతో గోపాల్ భార్గవ తీరుపై అందరూ నోరెళ్లబెట్టగా, ఆయన మాత్రం తన చర్యను సమర్ధించుకున్నారు.
నియోజకవర్గంలో తాను ఎక్కడికి వెళ్లినా మహిళలు తమ తాగుబోతు భర్తల గురించి ఫిర్యాదు చేస్తున్నారని, తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో వారు తప్పతాగి ఇళ్లకు రావడంతోపాటు తమను శారీరకంగా హింసిస్తున్నారని ఆ మహిళలు వాపోతున్నారని, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకే నవ వధువులకు మోగ్రీలను బహుమతిగా ఇస్తున్నానని ఆయన వివరించారు.