జాతీయ వార్తలు

ఫ్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: గడ్చిరోలి కోర్టు తీర్పుతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ ప్రజాసంఘాలు సాయిబాబా ఆరోగ్య కారణాల దృష్ట్యా మెరుగైన వైద్యసేవల కోసం వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాయి. డెమాక్రాటిక్ రైట్స్ ఆర్గనైజేషన్, తెలంగాణ, ఆంధ్ర డెమాక్రాటిక్ ఫోరాలు, పలు ప్రజా సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం ప్రొ. సాయిబాబా భార్య వసంత మాట్లాడుతూ తన భర్త ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నందువల్లనే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. జైలులో ఆయనకు కనీస సాదుపాయాలను కల్పించడం లేదని ఆమె అవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్యం క్షీణిస్తుందువల్ల ఆయనకు మెరుగైన ఆరోగ్య సేవలు కల్పించాలని కోరారు. దివ్వాంగుడు అయిన తన భర్త తన పని తాను చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయని, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.