జాతీయ వార్తలు

భారత్‌కు ఎర్డోగన్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆదివారం రాత్రి ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సోమవారం భేటీ అవుతారు. అణు ఇంధన సరఫరా దేశాల బృందంలో భారత సభ్యత్వం, కౌంటర్ టెర్రరిజం, వ్యాపార వాణిజ్య సహకారంపై ఇద్దరు నేతలు చర్చిస్తారు. ఏప్రిల్ 16న జరిగిన రిఫరండంలో తనకు అనుకూలంగా ఫలితాలు సాధించిన తరువాత ఎర్డోగన్ తొలి విదేశీ పర్యటన ఇదే. మొత్తం 150మంది ప్రతినిధి బృందంతో ఆయన భారత్ వచ్చారు. భారత్‌తో తమకు ముందు నుంచీ సత్సంబంధాలు ఉన్నాయని, ఎర్డోగన్ తెలిపారు. అణు ఇంధన సరఫరా దేశాల బృందంలో సభ్యురాలైన టర్కీ, భారత సభ్యత్వానికి మద్దతునిస్తుందని భావిస్తున్నారు. మోదీతో భేటీలో ఈ విషయం ప్రధానంగా చర్చకు రావచ్చు. దీనిపై టర్కీ ప్రభుత్వంతో భారత్ నిరంతరంగా మంతనాలు జరుపుతూనే ఉంది. టర్కీ ఇప్పటికీ భారత్ అభ్యర్థిత్వాన్ని ప్రత్యక్షంగా వ్యతిరేకించటం లేదు. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలకు ఎన్ ఎస్‌జి సభ్యత్వం ఇవ్వరాదన్న వర్గానికి అనుకూలంగా ఉంది. దీంతో పాటు ఈ విషయంలో పాకిస్తాన్‌ను టర్కీ సమర్థిస్తోంది. ఫెతుల్లా గులెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ భారత్ చొరబడిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని టర్కీ డిమాండ్ చేస్తోంది. దీనిపై భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఫెటోకు రహస్య నేర నెట్‌వర్క్ ఉందని సంఘాలు, పాఠశాలల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆరోపించింది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు దీనిపై చర్య అనివార్యమని టర్కీ అంటోంది.