జాతీయ వార్తలు

నిలకడగా కరుణానిధి ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 1: డిఎంకె అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె.స్టాలిన్ సోమవారం వెల్లడించారు. వచ్చేనెలలో 94వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్న కరుణానిధి అనారోగ్య సమస్యల కారణంగా గత ఏడాది అక్టోబర్ నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వైద్యులు అనుమతిస్తే కరుణానిధి అందరినీ కలుసుకుంటారని స్టాలిన్ తెలిపారు.
జూన్ 3వ తేదీన కరుణానిధి తన 94వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్టాలిన్ పై సమాధానమిచ్చారు. కరుణానిధి వాడిన మందుల వలన ఎలర్జీ సమస్యలు తలెత్తడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు గత ఏడాది అక్టోబర్‌లో ఆయనకు సూచించారు.