జాతీయ వార్తలు

పార్లమెంటులో వర్గీకరణ బిల్లుపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘్ఢల్లీ దండోరా’ నినాదంతో ధర్నా నిర్వహించారు. ధర్నాలో టిఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొని సంఘీభావం తెలిపారు. బిజెపి ప్రభుత్వం వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకుని తక్షణమే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతామని బిజెపి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఎంపీ కవిత చెప్పారు. ఎస్సీవర్గీకరణ గతంలో అన్ని పార్టీలు తీర్మానాలు చేశాయని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఉషామెహ్రా కమిషన్ ఆర్టికల్ 347ను సవరించాలని ప్రతిపాదించిందని, ఇదే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని వెల్లడించారు.

chitram సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఎమ్మార్పీఎస్ ధర్నాలో పాల్గొన్న ఎంపి కవిత