జాతీయ వార్తలు

బిజెపి ఎంపీ ఇంటిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: పార్లమెంట్ సభ్యుడు, బిజెపి ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిని ముట్టడించి ఆయన సిబ్బందిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను (సోదరులను) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కారులో వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు సోమవారం తెల్లవారు జామున దాదాపు 1.30 గంటల ప్రాంతంలో ఎంపీ ఇంటి వెలుపల ఆయన సిబ్బందిలో ఒకరు నడుపుతున్న వాహనంలోకి చొరబడ్డారని, ఆ తర్వాత టెంపోలో తమ స్నేహితులను ఇనుప రాడ్లడో అక్కడికి రప్పించిన వారు అక్కడి సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారని తివారీ వ్యక్తిగత సహాయకుడు తెలిపాడు. అనంతరం వారు గేటు గుండా లోనికి ప్రవేశించిన వారు తివారీ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారని, తివారీ ఎక్కడున్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తూ తమను దుర్భాషలాడారని తివారీ సహాయకుడితో పాటు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు తివారీ ఇంట్లో లేరని తెలుస్తోంది.