జాతీయ వార్తలు

ఆప్‌లో కుమ్ములాటలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 35 మంది ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకుడు కుమార్ విశ్వాస్‌కు మద్దతు తెలుపుతూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాయడం కలకలం రేపింది. కుమార్‌పై ఆరోపణలు చేసిన ఢిల్లీ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. కేజ్రీవాల్‌ను తప్పించి కుమార్ విశ్వాస్ ఆప్ బాధ్యతలు చేపడతారని, అలాగే ఆప్ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరతారని ఖాన్ ఆదివారం వాట్సప్ మెస్సేజ్‌లు పంపారు. అంతేకాదు కుమార్ బాటలోనే పలువురు ఎమ్మెల్యేలు వెళ్తారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖాన్ వ్యాఖ్యలపై పార్టీలోని 35 మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా ధ్వజమెత్తారు. కుమార్ విశ్వాస్ ప్రతిష్టకు భంగం కలిగించడమేకాకుండా ఆప్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఉండగా ఆదివారం నాటి వాట్సప్ మెస్సేజ్‌కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘కుమార్ విశ్వాస్ నా పెద్ద సోదరుడు వంటివాడు. మా ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటివారు పార్టీకి శత్రువులు వంటివారే. వారొక విషయం తెలుసుకోవాలి. మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించలేరనే విషయాన్ని గమనించాలి’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆప్ కోర్ కమిటీ సమావేశంలో అన్ని విషయాలు చర్చిస్తామని ఆయన వెల్లడించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో విశ్వాస్, ఖాన్ కూడా సభ్యులుగానే ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు కుమార్ విశ్వాస్‌పై ఆరోపణలు చేసిన అమానతుల్లాఖాన్‌కు పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, దిలీప్ పాండే, బ్రిజేష్ పాథక్‌లకు అత్యంత సన్నిహితుడు. కాగా కుమార్ ఆప్‌ను వీడతారనే వందతులు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తడం ద్వారా బిజెపిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ ఘన విజయం సాధించింది.