జాతీయ వార్తలు

ఉగ్రవాదానికి పోలీసుల ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ/ హైదరాబాద్, మే 1: ఐఎస్‌ఐఎస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి తెలంగాణ పోలీసులే ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారు. యువతను రెచ్చగొట్టేందుకు పోలీసులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారమిచ్చారా? అధికారమిస్తే దానికి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలి’ అంటూ కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, మాజీ సిఎం, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సోమవారం ట్వీట్ చేయడం తెలంగాణలో సంచలనం సృష్టించింది. దిగ్విజయ్ ట్వీట్లపై ఐటి మంత్రి కె తారక రామారావు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోవున్న మంత్రి కెటిఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దీనిపై స్పందించాలని, లేకుంటే ఇది ఆ పార్టీ వైఖరిగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులపైనా దిగ్విజయ్ బాధ్యతారహితమైన కామెంట్లు చేయడాన్ని ప్రస్తావించారు. ద్విగ్విజయ్ క్షమాపణ చెప్పకుంటే పార్టీపరంగా ఆయనపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా దిగ్విజయ్ నిరాధార ఆరోపణలు చేశారని తెలంగాణ డిజిపి ఖండించారు. బాధ్యత కలిగిన సీనియర్ నేతనుంచి ఇలాంటి ప్రకటన ఊహించలేమన్నారు. జాతి వ్యతిరేక శక్తులపై పోరాడుతున్న పోలీసు బలగాల ఇమేజ్, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లడడం తగదని ట్విట్‌లో పేర్కొన్నారు. అసాంఘిక శక్తులను ఎదుర్కొనే శక్తి తెలంగాణ పోలీసులకు ఉందని, దేశంలో నెంబర్‌వన్ స్థానానికి చేరిన తెలంగాణ పోలీస్‌కు నకిలీ వెబ్‌సైట్‌లలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని డిజిపి స్పష్టం చేశారు. దిగ్విజయ్ ట్విట్టర్‌లో సోమవారం తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఐఎస్‌ఐఎస్‌లో చేరాలంటూ ముస్లిం యువతను ప్రేరేపించటం నైతికమా? అని ప్రశ్నించారు. బోగస్ వెబ్‌సైట్‌లో రెచ్చగొట్టే సమాచారం తెలంగాణ పోలీసులు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్ రైలు పేలుడు సంఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేశారని, కాన్పూర్‌లో సైఫుల్లా ఎన్‌కౌంటర్ వెనుక తెలంగాణ పోలీసులు అందించిన సమాచారం ఉందని ట్విట్టర్‌లో దిగ్విజయ్ దుమారం లేపారు. దిగ్విజయ్ ట్విట్‌పై పలువురు తీవ్రంగా స్పందించారు. మరీ దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శిస్తే, దిగ్విజయ్‌పై తెరాస ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్, ఎంపీ కవిత తీవ్రంగా స్పందించి ఖండించినప్పటికీ దిగ్విజయ్ సింగ్ తిరిగి అదే మాట కొనసాగించారు. బాధ్యతాయుతమైన నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావంటూ దిగ్విజయ్ ట్వీట్‌పై ఎంపీ కవిత స్పందిస్తే, ‘మీ వాదనతో ఏకీభవిస్తున్నా. మరి తెలంగాణ పోలీసులు నకిలీ వెబ్‌సైట్‌తో ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించేలా పోస్టులు రాయడం సంగతేమిటి? అని ప్రశ్నిస్తూ మళ్లీ ట్విట్ చేశారు. దిగ్విజయ్ అర్థరహిత మాటలు చూస్తుంటే కాంగ్రెస్ ఎంత ప్రస్ట్రేషన్‌లో ఉందో అర్థమవుతుందని, కాంగ్రెస్ వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెరాస ఎంపీ బాల్కసుమన్ ట్విట్ చేశారు. దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని, దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలుగా బిజెపి శాసన సభాపక్షం నాయకుడు కిషన్‌రెడ్డి అభివర్ణించారు.