జాతీయ వార్తలు

జస్టిస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్‌కు ఈ నెల 4వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో కూడిన బోర్డు ఈ పరీక్షలు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ వైద్యుల బోర్డు జస్టిస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించడంలో సహకరించేందుకు పోలీసు అధికారులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని పశ్చిమబెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)ని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహార్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనం, జస్టిస్ కర్ణన్ పరిపాలన, న్యాయాధికారాలను నిలిపివేస్తూ తాను గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావిస్తూ, ఫిబ్రవరి 8వ తేది తరువాత ఆయన జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకూడదని, పాటించకూడదని దేశవ్యాప్తంగా గల అన్ని కోర్టులు, ట్రిబ్యునళ్లు, కమిషన్లను ఆదేశించింది. కోర్టు ధిక్కార నోటీసుకు బదులివ్వాలని కూడా జస్టిస్ కర్ణన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ మే 8వ తేదిలోపు దీనికి సంబంధించి కర్ణన్ నుంచి స్పందన రాకుంటే, ఈ విషయమై చెప్పడానికి అతని వద్ద ఏమీ లేదని భావిస్తానని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, జె.చలమేశ్వర్, రంజన్ గొగోయి, ఎంబి లోకూర్, పిసి ఘోష్, కురియన్ జోసెఫ్ సభ్యులుగా గల ధర్మాసనం స్పష్టం చేసింది. మే 8వ తేదిలోగా మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం, కర్ణన్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ విచారణను మే 9వ తేదికి వాయిదా వేసింది.
జస్టిస్ కర్ణన్ మార్చి 31న సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయి, తన న్యాయ, పరిపాలనాధికారాలను పునరుద్ధరించాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు తాను గతంలో జారీ ఆదేశాలను సవరించడానికి తిరస్కరించడంతో, తాను మళ్లీ సుప్రీంకోర్టు ముందు హాజరు కాబోనని ఆయన తెగేసి చెప్పారు. కోర్టు ధిక్కార పిటిషన్‌పై ఇచ్చిన నోటీసుకు నాలుగు వారాలలో బదులివ్వాలని అప్పుడు సుప్రీంకోర్టు కర్ణన్‌ను ఆదేశించింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులంతా తన పట్ల కులవివక్షను ప్రదర్శించారని కర్ణన్ ఆరోపించారు.

చిత్రం..జస్టిస్ కర్ణన్