జాతీయ వార్తలు

నీట్‌పై మళ్లీ ‘సుప్రీం’కు కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: నీట్ వ్యవహారంపై ఎన్‌డిఎ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం లోక్‌సభలో ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. నీట్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మూలంగా విద్యార్థులు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ఎంపిలు సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. దీనికి వెంకయ్య నాయుడు స్పందిస్తూ, మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మూలంగా విద్యార్థులు, ముఖ్యంగా దక్షిణాది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటకతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు నీట్ పట్ల అభ్యంతరం తెలియజేయటంతో పాటు ఈ అంశంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేయనున్నాయి. తమిళనాడులో విద్యార్థులకు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ సీట్లను కేటాయించే విధానం అమలులో ఉన్నందున నీట్‌ను అమలు చేయడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వెంకయ్య నాయుడు చెప్పారు. నీట్‌పై ఎంపిలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి.నడ్డాకు వివరించి తగు చర్యలు తీసుకుంటామని వెంకయ్య నాయుడు తెలిపారు. న్యాయ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో చర్చించిన తర్వాత నీట్ వివాదంపై ఏమి చేయాలన్న దానిని నడ్డా నిర్ణయిస్తారని ఆయన సభకు హామీ ఇచ్చారు.
మొదట మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపిలు జీరో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, నీట్ వలన తమ రాష్ట్రాల్లోని విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని విద్యార్థులందరికీ ఒకే పరీక్ష ఉండాలని సుప్రీం కోర్టు అకస్మాత్తుగా నిర్ణయించటం ఎంత మాత్రం సబబు కాదని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పు చేయటం వల్లనే సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని వారు విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్థానిక సిలబస్ ప్రకారం విద్యా బోధన జరుగుతోందని, నీట్ పరీక్షలు సిబిఎస్‌సి ప్రకారం జరుగుతాయి కాబట్టి దక్షిణాది విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సభ్యుడు వేణుగోపాల్ వాదించారు. మాతృ భాషలో మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు రాసే దక్షిణాది విద్యార్థులకు కేవలం ఆంగ్లం, హిందీ భాషల్లో మాత్రమే నీట్ పరీక్ష నిర్వహిస్తే వారికి నష్టం వాటిల్లదా? అని ఆయన నిలదీశారు. కేరళలో ఇది వరకే మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు నీట్ పరీక్షలకు హాజరు కావాలంటే ఎలా సాధ్యమవుతుందని వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీట్ విధానాన్ని కేరళ వ్యతిరేకించటం లేదని, ఈ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవలసి ఉందని, ఈ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోకుండానే నీట్ నిర్వహించాలనటం ఎంత వరకు సబబు అని ఆయన నిలదీశారు. నీట్‌ను వచ్చే సంవత్సరం నుండి అమలు చేయాలని, ఈ లోగా అందుకు అవసరమైన యంత్రాన్ని రూపొందించుకుని సిలబస్ మూలంగా విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. వేణుగోపాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పలువురు ఎంపిలు ఏకీభవించారు. నీట్ పరీక్షను ఈ సంవత్సరానికి వర్తింపజేయకూడదు, అన్ని ఏర్పాట్లతో వచ్చే సంవత్సరం నుండి అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. నీట్ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయ నిపుణులతో చర్చలు జరపాలన్నారు. నీట్ పరీక్షలు రెండు దఫాలుగా నిర్వహించటం వలన విద్యార్థులకు నష్టం వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తీర్పును పునస్సమీక్షించాలి
ఇదిలావుంటే, నీట్‌పై తీర్పును పునస్సమీక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టుకు మొరపెట్టుకున్నాయి. దీనిపై జస్టిస్ దవే స్పందిస్తూ ఏపి, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్ధనలను మంగళవారం పరిశీలిస్తామని తెలిపారు. నీట్‌కు సంబంధించి గతంలో దాఖలైన అన్ని పిటిషన్లను మంగళవారం పరిశీలిస్తున్నందున తెలుగు రాష్ట్రాల అభ్యర్ధనలను కూడా వాటితో కలిపి పరిశీలిస్తామని చెప్పారు. నీట్‌పై పటిషన్లు వేసిన వారంతా మంగళవారం కోర్టుకు రావాలని జస్టిస్ దవే సూచించారు.