జాతీయ వార్తలు

కాశ్మీర్ అంశంలో తలదూర్చిన ఎర్డోగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కాశ్మీర్ అశంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఎర్డోగన్ ఆదివారం సాయంత్రం భారత్‌కు చేరుకోవడానికి ముందు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి బహుళ పక్షాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతటితో ఆగకుండా ఈ అంశంపై భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ‘మరింత మంది చనిపోవడానికి మనం అవకాశం ఇవ్వొద్దు. మేము కూడా భాగస్వాములం అయ్యే బహుళ పక్షాల చర్చల ప్రక్రియతో ఈ సమస్యకు ఒకేసారి తుది పరిష్కారానికి కనుగొనడానికి మార్గాలు వెతకాలి’ అని ఎర్డోగన్ డబ్ల్యుఐఒఎన్ (వియొన్) న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ రెండూ కూడా టర్కీకి మిత్రదేశాలని, అందువల్ల ఈ రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియను పటిష్ఠం చేయాలని కోరుకుంటున్నానని ఎర్డోగన్ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు కాశ్మీర్ వివాదంపై భారత్ దీర్ఘకాలికంగా అనుసరిస్తున్న వైఖరికి విరుద్ధంగా ఉన్నాయి. కాశ్మీర్‌పై మూడోపక్షం జోక్యాన్ని భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోంది. ‘్భరత్-టర్కీ సంబంధాలు ఈ రెండు దేశాల విధానాలపై ఆధారపడి ఉన్నాయని మేము ఎల్లవేళలా చెబుతూ వస్తున్నాం. టర్కీ మన మనోభావాలను గౌరవిస్తుందని విశ్వసిస్తున్నాం’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి రుచి ఘనశ్యాం అన్నారు. భారత్‌లో జమ్మూకాశ్మీర్ అంతర్భాగమనే మనదేశ వైఖరి అందరికి తెలిసిందేనని ఆమె పేర్కొన్నారు. అయతే ఎర్డోగన్ పర్యటన ప్రధానంగా వ్యాపార సంబంధాలపైనేనని, ఆయనతోపాటు 150 మంది వ్యాపారవేత్తలు భారత పర్యటనకు వచ్చారని తెలిపారు.