జాతీయ వార్తలు

ఎంతైనా సమంజసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 2:ఆధార్‌ను పాన్‌కార్డుకు అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం గట్టిగా సమర్థించుకుంది. ఈ అనుసంధానత తప్పని సరి అని, దీని వల్ల ఓ బలమైన, స్థిరమైన వ్యవస్థ ఏర్పాటుకు ఆస్కారం ఏర్పడుతుందని సుప్రీం కోర్టుకు నివేదించింది. నకిలీ పాన్ కార్డుల జాడ్యాన్ని కూడా ఆధార్‌ను అనుసంధానత వల్ల అరికట్ట వచ్చునని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ తెలిపారు. ఆదాయం పన్ను చట్టంలోని 139 ఎఎ సెక్షన్ ప్రకారం పాన్ కార్డు ఇవ్వాలంటే ఆధార్ తప్పని సరి అవుతుందని ఉద్ఘాటించారు. ఈ నిబంధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్న ఆయన తన అనుభవాన్ని కూడా వివరించారు. వ్యక్తుల వివరాలను గుర్తించే అధికారం కేంద్రానికి ఉందని, దీనికి ఎవరూ మినహాయింపుకాదని స్పష్టం చేశారు. ఏ హక్కూ పరిపూర్ణం కాదని, చివరికి శారీరక హక్కు కూడా పరిపూర్ణం కాదని అటార్నీ అన్నారు.