జాతీయ వార్తలు

కొంతకాలం కొనసాగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మరి కొంతకాలం గవర్నర్‌గా సేవలందిస్తారు. తదుపరి ఏర్పాట్లు చేసేంతవరకు తెలుగు రాష్ట్రాలకు గవర్నరుగా కొనసాగాలని నరసింహన్‌ను కోరుతూ కేంద్రం వౌఖిక ఆదేశాలు జారీ చేసిం ది. ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ పదవీకాలం నేటితో ముగుస్తోంది. ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్, బిజెపి జాతీయ కార్యవర్గంలో పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నారు. ఆ మార్పులతోపాటు గవర్నర్లు, ఇతర కీలక పదవుల్లో పార్టీకి చెందిన కొందరు సీనియర్లను నియమించే యోచన ఉంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు కొత్త గవర్నర్‌ను నియమించకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే ప్రక్రియలో భాగంగా ఏపీ, తెలంగాణకు కొత్త గవర్నర్లలను నియమించాలని ఆలోచిస్తునట్టు బిజెపి వర్గాలు తెలిపాయి. అందుకే తదుపరి ఏర్పాట్లు చేసేంతవరకు గవర్నర్ పదవిలో కొనసాగాలని నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం కోరినట్టు చెబుతున్నారు. ఇదిలావుంటే నరసింహన్‌ను తదుపరి ఏర్పాట్లు చేసేంతవరకు గవర్నర్ పదవిలో కొనసాగించేందుకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా జారీ కాలేదు. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైన పదవి కాబట్టి ఆయనను తదుపరి ఏర్పాట్లు చేసేంతవరకు కొనసాగించాలంటే రాష్టప్రతి భవన్ నుండి ఆదేశాలు జారీ కావాల్సి ఉంటుంది.